SAKSHITHA NEWS

వడ్లమన్నాడులో అమూల్ డైరీ పాల కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని….పార్టీ శ్రేణులతో కలిసి గ్రామంలో పర్యటన

-పాడి రైతులకు మంచి చేసేందుకే అమూల్ డైరీలు నెలకొల్పుతున్నాం…ఎమ్మెల్యే నాని….

-ప్రైవేటు డైరీలన్ని సిండికేట్ గా మారి రైతులను దోచుకుంటున్నాయని వెల్లడి….

-అమూల్ డైరీలో పాలు పోస్తే లీటర్ కు పది రూపాయల అధిక ఆదాయం రైతుకు వస్తుంది….

గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని మధ్యాహ్నం పర్యటించారు. గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే కొడాలి నానికు వైఎస్ఆర్సిపి నేతలు, ప్రజానీకం ఘన స్వాగతం పలికారు. తొలుత గ్రామ సెంటర్లోని స్వర్గీయ వైయస్సార్, వంగవీటి మోహనరంగాల విగ్రహాలకు పూలమాలలు వేసి ఎమ్మెల్యే కొడాలి నాని నివాళులర్పించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో కలిసి గ్రామంలో పర్యటన కొనసాగించిన ఎమ్మెల్యే నానికు, వీధి వీధినా మంగళ హారతులు, పూల మాలలతో మహిళలు, గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన అమూల్ డైరీ పాలకేంద్ర భవనాన్ని ఎమ్మెల్యే నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతులకు మేలు చేయాలనే సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా, పూర్తిస్థాయి వసతులు కల్పిస్తూ సీఎం జగన్ అమూల్ డైరీలను ఏర్పాటు చేస్తున్నారని ఎమ్మెల్యే కొడాలి నాని తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రవేటు డైరీలన్ని సిండికేట్ గా ఏర్పడి, జిల్లాల వారీగా పంచుకొని రైతులను దోచుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటైన అమూల్ డైరీలో పాలు పోస్తే లీటరుకు పది రూపాయలు ఎక్కువ ఆదాయం రైతులకు లభిస్తుందని ఎమ్మెల్యే నాని తెలిపారు. అంతేకాకుండా డైరీలో వచ్చిన లాభాలన్నీ ఏడాదికి ఒకసారి డివిడెంట్ రూపంలో తిరిగి రైతులకే చెల్లించేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని, అమూల్ డైరీ సేవలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కొడాలి నాని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో శ్రీ కొండాలమ్మ వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ చైర్మన్ శేషం గోపి, వైఎస్ఆర్ సీపీ నాయకులు
పాలేటి చంటి, కృష్ణాజిల్లా యువజన విభాగ అధ్యక్షుడు మెరుగు మాల కాళీ,మండల వ్యవసాయ కమిటీ అధ్యక్షుడు పెన్నేరు ప్రభాకర్ రావు, యూత్ అధ్యక్షుడు గుదే రవి, శేరిదగ్గుమిల్లి ఎంపిటిసి ముక్కు సోమేశ్వరరావు, వడ్లమన్నాడు ఎంపీటీసీ మండా దిలీప్ కుమార్ , వడ్లమన్నాడు సర్పంచ్ కటికల జ్యోతి,
డోకిపర్ సర్పంచ్ గోసాల జ్యోతి, గాదెపూడి సర్పంచ్ వీర్నాల లక్ష్మణరావు,పోలిమెట్ల సర్పంచ్ అడుసుమల్లి రామ్మోహన్ , చంద్రాల సర్పంచ్ కాలిశెట్టి అర్జున్ రావు ,
గిరి బాబాయ్ ,గరికపాటి గోపి,మంటాడ చలమయ్య,
అబ్దుల్ రహీం,కుంచపర్తి సాయి,అప్పినేడి నాంచారయ్య,అప్పినేడి భాస్కరరావు, పెనుమాల రంగారావు,కిషోర్ నాయుడు,బెజవాడ సముద్రుడు ,
కొడాలి ప్రసాద్,చందన నాగన్న నాయుడు,గోసాల కుమార్,గోసాల లవ కుమార్,అల్లూరి ఆంజనేయులు,
పామర్తి హరిబాబు,నిమ్మగడ్డ కుటుంబరావు,సాయన హరిబాబు,మహా రెడ్డి మురళి, మండలంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు అభిమానులు , సచివాలయ కన్వీనర్ లు , గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 03 06 at 3.39.39 PM

SAKSHITHA NEWS