SAKSHITHA NEWS

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఆహ్వానం మేరకు తాను, తన కుమార్తె కావ్య ఆ పార్టీలో చేరామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘వ్యవస్థలను అపహాస్యం చేసే విధంగా కేంద్రం వ్యవహరిస్తోంది. సీబీఐ, ఈడీ కేసుల్లో ప్రతిపక్ష పార్టీ నేతలను ఇరికిస్తున్నారు. వారు భాజపాలో చేరగానే పునీతులవుతున్నారు. భాజపా ఆగడాలు అడ్డుకునేందుకు కాంగ్రెస్‌లో చేరాను. ప్రతిపక్షంలో ఉంటే నియోజకవర్గ సమస్యలు పరిష్కరించలేం. భారాసలో నాకు కేసీఆర్‌ ఎన్నో అవకాశాలు ఇచ్చారు. చాలా మంది ఆ పార్టీని వీడినా.. నన్నే ఎక్కువగా టార్గెట్‌ చేశారు. మనవరాలి వయసున్న అమ్మాయి చేతిలో ఎర్రబెల్లి ఓటమి సిగ్గుచేటు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. భారాసకు చీడపురుగులా మారారు. నేను అవకాశ వాదిని కాదు.. అవకాశాలే నావద్దకు వచ్చాయి. నన్ను రాజీనామా చేయాలని అడిగే హక్కు భారాస నేతలకు లేదు’’ అని కడియం అన్నారు. భారాసను కడియం శ్రీహరి, కావ్య వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అనంతరం వరంగల్‌ లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ కడియం కావ్యకు కేటాయించింది.

WhatsApp Image 2024 04 02 at 1.40.53 PM

SAKSHITHA NEWS