కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ బస్తీలో మిగిలి ఉన్న సీసీ రోడ్లు, లైబ్రరీ ఏర్పాటు, హై స్కూల్ నిర్మాణంకు కృషి చేయాలని ఎమ్మెల్యే ని కోరారు. దీంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. త్వరలోనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తంగ లక్ష్మారెడ్డి మరియు భగత్ సింగ్ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొండల శ్రీనాథ్ రావు, జనరల్ సెక్రెటరీ కామ్రేడ్ సత్యం, కార్యవర్గ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లవేళలా ముందుంటా : ఎమ్మెల్యే
Related Posts
అరెస్ట్ లకి భయపడేది లేదు, ప్రజా సమస్యల మీద పోరాటం ఆగదు
SAKSHITHA NEWS అరెస్ట్ లకి భయపడేది లేదు, ప్రజా సమస్యల మీద పోరాటం ఆగదు: మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తాండూరు గిరిజన బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగి 15 మంది ఆసుపత్రి పాలైన ఘటనకి సంభందించి విద్యార్థులని…
34,500/- నగదు అందజేత..
SAKSHITHA NEWS 34,500/- నగదు అందజేత..సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-బుగ్గారం : మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సోషల్ మీడియా ధర్మపురి నియోజకవర్గ కో-కన్వీనర్ పంచిత లక్ష్మణ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బిజెపి నాయకులు కార్యకర్తలు…