ఆడపడుచులకు ట్రైనింగ్ సెంటర్లో కుట్టు మిషన్లు కార్యక్రమం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Spread the love

ఆడపడుచులకు ట్రైనింగ్ సెంటర్లో కుట్టు మిషన్లు కార్యక్రమం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామంలో ఈరోజు కుట్టుమిషన్లను నల్లవల్లి గ్రామ ఆడపడుచులకు ట్రైనింగ్ సెంటర్లో ఇవ్వడం జరిగింది. ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ హైదరాబాద్ బ్రాంచ్ వారు ఆడపిల్లల కోసం టైలరింగ్ నేర్పించడానికి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు.

టైలరింగ్ నేర్పించిన తర్వాత వారు కుట్టు మిషన్లు తిరిగి తీసుకువెళ్తారు కాబట్టి ఇట్టి విషయాన్ని నల్లవల్లి ఎంపిటిసి కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి , నల్లవల్లి సర్పంచ్ దోమడుగు శంకర్ గారి ద్వారా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి తెలియజేయగా తక్షణమే ఆడపిల్లలకు అండగా ఉండాలని నాలుగు కొత్త కుట్టు మిషన్లను వారికి ఇప్పించి టైలరింగ్ నేర్చుకోవాల్సిందిగా కోరారు .

ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంపీటీసీ మరియు సర్పంచ్ గారు ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ , మాజీ వార్డ్ మెంబర్ బాలయ్య , నాయకులు జైపాల్ , కుర్మా మల్లేష్ , చంద్రయ్య , బొడ్డు వెంకటేష్ , ఆడపడుచులతో కలిసి మరియు గ్రామ కమిటీ టిఆర్ఎస్ అధ్యక్షుడు పెద్దంగాల మహేష్ పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page