గణపురం మండలం, భూపాలపల్లి నియోజకవర్గం:
భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం ధర్మరావుపేట గ్రామంలో రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. కాగా, ఇట్టి వేడుకకు గ్రామస్తుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని, దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ, గ్రామస్తులు ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ.. రేణుక ఎల్లమ్మ అమ్మవారి దయ, కరుణ, కటాక్షలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ప్రేమ భావంతో మెలగాలని, ఒకరినొకరు మంచి కోరుకోవాలని అన్నారు. ఈ దేవాలయం అభివృద్ధికి తన నిధులను ఇస్తానని ఎమ్మెల్యే జీఎస్సార్ హామీ ఇచ్చారు. దేవాలయం ప్రశాంత వాతావరణంలో నిర్మించిన గౌడ సంఘం నాయకులను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు, గ్రామస్తులు ఎమ్మెల్యే కు శాలువాలు కప్పి ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.
ధర్మరావుపేటలో రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…