SAKSHITHA NEWS

నూతన కూరగాయల మార్కెట్ మరియు పట్టణ నిరాశ్రయుల ఆశ్రమ కేంద్రంను ప్రారంబించిన ఎమ్మెల్యే గండ్ర


సాక్షిత : భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపో ప్రక్కన వ్యాపారస్తులకు మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 2 కోట్ల 6 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ ప్రారంభించిన మరియు 1 కోటి 40 లక్షల రూపాయలతో నిర్మించిన పట్టణ నిరాశ్రయుల కేంద్రం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి మరియు జిల్లా అదనపు కలెక్టర్ దివాకర్ ….

ఈ కార్యక్రమంలో గండ్ర మాట్లాడుతూ….
1988 స్వర్గీయ ఎం టి రామారావు భూపాలపల్లిలో ఉన్న నల్లబంగారాన్ని వెలికి తీసిన నాటి నుంచి నేటి భూపాలపల్లి పట్టణం ఎంతో అభివృద్ధి వైపుగా అడుగులు వేస్తోంది..

భూపాలపల్లి పట్టణ వాసులకు మార్కెట్ యార్డ్ ప్రారంభించడం ద్వారా మెరుగైన సేవలు అందుబాటులో ఉంటాయి.
యార్డ్ పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుబ్రంగా ఉంచుకోవాలి.
ఖచ్చితంగా మార్కెట్ యార్డుకి ఒక సెక్యూరిటి ని నియమించి ,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా చూడాలి.
మార్కెట్ యార్డ్ లో ఉండే వ్యాపారస్థూలకు బ్యాంక్ లద్వారా ఋణసదుపాయం కల్పించి,వారికి అండగా ఉంటాం..
భూపాలపల్లి అభివృద్ధి జరగటం లేదు అని మాట్లాడే పార్టీల నాయకులకు జరుగుతున్న అభివృద్ధి కంటికి కనపడటం లేదా ..
దాదాపు 130కోట్లతో భూపాలపల్లి కి ఔటర్ రింగ్ రోడ్డు నిధులు మంజూరు…
రూ.70 కోట్లతో కుందురుపల్లి నుంచి బాంబుల గడ్డ వరకు రహదారి వెడల్పు, సైడ్ డ్రైన్ నిర్మాణం..
రూ.50కోట్లతో భూపాలపల్లి నుంచి కాశింపల్లి వరకు, మంజూర్ నగర్ నుంచి మహబూబ్ పల్లి వరకు రెండు లైన్ దారితో సెంటర్ లైటింగ్ పనులు కొనసాగుతున్నాయి.


ఇటీవల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు భూపాలపల్లి మున్సిపాలిటీ రూ.50కోట్ల నిధులను మంజూరు చేశారు. త్వరలోనే అభివృద్ధి పనులకు రూపకల్పన చేసి త్వరలోనే పనులను ప్రారభించుకోవడం జరుగుతుంది.
భూపాలపల్లిలో సింగరేణి కార్మికులకు మొదటి సారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1000 క్వార్టర్స్ నిర్మించడం జరిగింది. మళ్ళీ ఇటీవలే గౌ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో మరో 1000క్వార్టర్స్ ని నిర్మించుకుని ఇటీవలే ప్రారభించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS