వరంగల్ – హనుమకొండ – కాజీపేట లోని ఫాతిమా మాత 70 ఏళ్ళ ఉత్సవాలలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు *

Spread the love

వరంగల్ – హనుమకొండ – కాజీపేట లోని ఫాతిమా మాత 70 ఏళ్ళ ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు *
సాక్షిత : ఫాతిమా మాత ను సందర్శించారు
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్*
ఇక్కడకు అనేక ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఫాతిమా మాత పండుగ శుభాకాంక్షలు!
9 రోజులుగా జరుగుతున్న ఫాతిమా మాత ఉత్సవాలకు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది
3 రోజుల ముఖ్యమైన ఈ ఉత్సవాలు ముగింపు దశకు వచ్చాయి
ఈ ఫాతిమా మాత చర్చికి ఎంతో చరిత్ర ఉంది
దేశంలో ఫాతిమా పేరుతో ఉన్న చర్చి కాజీపేట లోనే ఉండటం విశేషం

1949లోనే కాజీపేట లో 71 ఎకరాల స్థలం కొనుగోలు చేసి, చర్చి నిర్మించాలనే సంకల్పం జరిగింది
కానీ ఆనాటి ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు
1950 మే 13న పోర్చు గీసు నుండి ఫాతిమా స్వరూపాన్ని తెచ్చి, అడ్డంకులు అన్నీ తొలగిపవాలని పూజలు చేశారు
1951 జనవరి 14న శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాంతాన్ని ఫాతిమా నగర్ గా మార్చారు

ఆ రోజుల్లో ములుగు ప్రాంతం నుంచి ప్రత్యేక రాయిని తెప్పించి, 6 ఏళ్లు శ్రమించి ఈ అద్భుత రాతి కట్టడాన్ని నిర్మించారు
1962 మార్చి 13న అంటే 70 ఏళ్ళ కింద సరిగ్గా ఈ రోజు ఇక్కడ క్రీస్తు తల్లి ఫాతిమా మాత స్వరూపాన్ని పెట్టి చర్చిని ప్రారంభించారు
అప్పటి నుండి ఇక్కడ ప్రతి ఏటా ఈ పూజలు జరుగుతున్నాయి

శాంతి, కరుణ, ప్రేమ, సేవ అన్న క్రీస్తు బోధనలు అందరికీ ఆచరణీయం
సిఎం కేసిఆర్ అన్ని మతాలను సమానంగా చూస్తూ అధికారికంగా అన్ని పండుగలు నిర్వహిస్తున్నారు
తెలంగాణలో క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం
అందరినీ ప్రేమించాలి
శాంతి మార్గంలో నడవాలి
సేవాభావంతో మెలగాలి అన్న క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయము
క్రీస్తు బాటలో నడిస్తే ఈ ప్రపంచంలో మోసాలు, పాపాలు ఉండవు
యుద్దాలకు ఆస్కారం ఉండదు


అన్ని మతాల సారం మానవత్వమే, అన్ని మతాలకు దేవుడు ఒక్కడే
దేశం మొత్తంలో క్రిస్మస్ పండగను అధికారికంగా నిర్వహిస్తూ, 2 లక్షల 85వేల మంది క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు నూతన బట్టలిచ్చి, విందు ఇస్తున్న గొప్ప సంస్కృతిని నెలకొల్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్
క్రిస్టియన్ మైనారిటీల ఆత్మగౌరవం పెంపొందించేలా వారికి 2 ఎకరాల స్థలంలో 10 కోట్ల రూపాయలతో క్రిస్టియన్ భవనం నిర్మిస్తున్నారు*


గతంలో ఎప్పుడూ లేనివిధంగా చర్చిల నిర్మాణానికి, మరమ్మత్తులకు, ఆధునీకరణకు, మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టేందుకు అనుమతినిచ్చిన ఏకైక ప్రభుత్వం
క్రిస్టియన్ విద్యార్థులు నాణ్యమైన విద్య పొందేందుకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్లు ఇస్తున్నారు
విదేశాల్లో విద్య అభ్యసించేందుకు ఓవర్సీస్ స్కాలర్ షిప్ 20 లక్షల రూపాయలు అందిస్తున్నారు.
క్రిస్టియన్ యువతకు ఉపాధి కల్పించేందుకు డ్రైవర్ ఎంపవర్ మెంట్ కింద 60 శాతం సబ్సిడీతో కార్లను అందిస్తున్నారు
10 లక్షల వరకు సబ్సిడీ అందేలా బ్యాంకు లింకేజీతో రుణాలు కల్పిస్తున్నారు.
ఇప్పటి వరకు 1718 మందికి 19 కోట్ల రూపాయలను సబ్సిడీగా కెసిఆర్ ప్రభుత్వం అందించింది
టిఎస్ ప్రైమ్ కింద క్రిస్టియన్ మైనారిటీ యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నాము
ఐటి పారిశ్రామిక వేత్తల కోసం ఐటి పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.


ఇలా క్రిస్టియన్ మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో కృషి చేస్తోంది
దీనిని క్రిస్టియన్లందరూ గుర్తించి కేసిఆర్ కి మద్దతుగా నిలవాలి
ఈ కార్యక్రమం లో డాక్టర్ ఉడుముల బాల, వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన క్రీస్తు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page