ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిసిన ధర్మ నాయక్ తండ బంజారా రైతు సంఘం సభ్యులు.
సారంగాపూర్ మండలం ధర్మానాయక్ తాండ గ్రామ బంజారా రైతులు గత ఐదు సంవత్సరాల నుండి ప్యాక్స్ సొసైటీ ఆధ్వర్యం లో వడ్లు కొనుగోలు చేస్తున్నారని,వడ్ల కొనుగోలు కేంద్రనికి స్థలం లేనందున రోడ్లకు ఇరువైపులా వడ్లు ఆరబెడుతున్నం అని, దానివల్ల వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందని, గ్రామ శివారులో ఉన్న ఖాళీ స్థలాన్ని వడ్లు కొనుగోలు కేంద్రానికి కేటాయించాలని ఎమ్మెల్యే కి వినతిపత్రాన్ని అందజేసిన ధర్మానాయక్ తాండ బంజారా రైతు సంఘం సభ్యులు.
సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే జిల్లా అటవీ అధికారితో ఫోన్ లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని తెలపగా సానుకూలంగా స్పందించి రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపిన బంజార రైతు సంఘం సభ్యులు, రైతులు.