వైద్య ఖర్చుల భారం నిరుపేదలపై పడకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..
ఆరుగురు లబ్ధిదారులకు రూ.9.70 లక్షలు మంజూరు.. పరిటాల గ్రామానికి చెందిన సయ్యద్ ఖాదర్ కు రూ.2 లక్షలు, అడవిరావులపాడు కు చెందిన వెలగా సంజయ్ కు రూ.1 లక్ష, చెరువుకొమ్ము పాలెం కు చెందిన గుణ్ణం ఈశ్వరమ్మకు రూ.1.20 లక్షలు, పాశం ధనుష్ రెడ్డి కు రూ.1.50 లక్షలు, నందిగామ కు చెందిన జాస్తి హరిత వర్షిణి కి రూ.2 లక్షలు, కొత్తపేట గ్రామానికి చెందిన పులి దినేష్ బాబుకు రూ.2 లక్షలు మంజూరు ..
ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోయిన ఆ కుటుంబం రోడ్డున పడకుండా వైయస్ఆర్ భీమా పథకాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..
నందిగామ నియోజకవర్గంలో ఇప్పటివరకు ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) ద్వారా నాలుగున్నరేళ్లలో 416 మంది లబ్ధిదారులకు రూ.2.30 కోట్ల అందజేత : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..
అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వ వైభవం తీసుకువచ్చి.. 108, 104 నూతన వాహనాలను ప్రవేశపెట్టి వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ..
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు ..