SAKSHITHA NEWS

జుజ్జూరు గ్రామంలో మండల స్థాయిలో వైయస్ఆర్ పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

అవ్వ తాతలకు అండగా జగనన్న ప్రభుత్వం.. సామాజిక పింఛన్ రూ.3 వేలకు పెంపు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

వీరులపాడు మండలంలో అన్ని రకాల పెన్షన్ల లబ్ధిదారులు 8876 మంది.. నూతనంగా 148 పెన్షన్లు మంజూరు ..

జుజ్జూరు గ్రామంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల స్థాయిలో వైయస్ఆర్ పెన్షన్ కానుకలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులకు పథకాలు అందుతున్నాయని.. పథకాల కోసం ఎవరి సిఫార్సులు అవసరం లేదని.. లంచాలకు తావు లేదని చెప్పారు. ప్రతి నెల ఒకటో తేదీ ఉదయాన్నే పింఛన్ డబ్బులను అందజేస్తూ అవ్వ తాతలు, వితంతువులు, వికలాంగులకు జగనన్న ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛను మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ.3 వేలకు పెంచారన్నారు. నవరత్న పథకాల ద్వారా పేద ,బడుగు, బలహీన వర్గాలకు వైయస్సార్సీపి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ను ఆశీర్వదించాలని కోరారు. టిడిపి వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. గత తెలుగుదేశం పాలనలో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు ..

Whatsapp Image 2024 01 06 At 4.39.44 Pm

SAKSHITHA NEWS