గులాబీ తీర్థం పుచ్చుకున్న లాలవల్లి కురుమ సంఘం సభ్యులు: ఎమ్మెల్యే దాసరి
ఎలిగేడు మండలంలోని లాలపల్లి గ్రామంలోని కురుమ సంఘ పెద్ద మనుషులు దాదాపు 100 మంది కాంగ్రెస్ పార్టీనీ వీడి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చేతుల మీదుగా గులాబీ కండువాలు కప్పుకొని బిఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది.
ఎమ్మెల్యే మాట్లాడుతూ మన సీఎం కేసీఆర్ అభివృద్ధిని చేస్తున్న తెలంగాణను చూసి వివిధ పార్టీల వారు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, గతములో ఏ ప్రభుత్వాలు ప్రజల కోసం ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదని, కాని మన తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, మన తెలంగాణను కేసీఆర్ గారు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, పెద్దపల్లి నియోజవర్గం అభివృద్దే నా లక్ష్యమని, అభివృద్ధి నా ద్యేయమని అన్నారు.
పార్టీలో చేరిన వారిలో కురుమ సంఘం అధ్యక్షులు చిగుర్ల జగ్గయ్య, (మాజీ ప్రెసిడెంట్,)చిగుర్ల రాములు, తిరుపతి, రాయుడు, లింగయ్య, రాజమల్లు, అయిలయ్య, మల్లేశం,కేంద గంగయ్య, పెద్ది మల్లేశం, శ్రీనివాస్,పర్శరాములు, అమరగొండ, రాజు,మల్లయ్య, ఏముండ్ల రాయుడు,తొంటి బిరయ్య తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎలిగేడు ఎంపీపీ తనపర్తి స్రవంతి మోహన్రావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బైరెడ్డి రాంరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, బద్దం తిరుపతిరెడ్డి, పెద్ది రాజేశ్వర్, బాదంపల్లి రాజేష్ తో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.