SAKSHITHA NEWS

నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి)
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కేతపల్లి మండలం కాసనగొడు, బోప్పారం,కొత్తపేట, కట్టంగూరు మండలంలోనిఅయిటిపాముల మునుకుంట్ల గ్రామాలలో పిఎసిఎస్ ఐకెపిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఎమ్మెల్యే చిరుమర్తి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు, సాగునీరు, ఉచిత విద్యుత్ పెట్టుబడి సాయం అందించడంతో అధిక ధాన్యం ఉత్పత్తితో దేశంలో తెలంగాణ ముందజలో ఉందన్నారు రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి సాయం కింద అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు రైతులు తమ కల్లాల వద్దనే ఆరబోసి నాణ్యత ప్రమాణాలు పాటించి ధాన్యం తీసుకురావాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు.


SAKSHITHA NEWS