చిట్యాల సాక్షిత ప్రతినిధి
చిట్యాల మండలం గుండ్రాంపల్లి లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండ్రాంపల్లి గ్రామ పరిధిలో జాతీయ రహదారి పక్కన సీఎం కేసీఆర్ నాటిన మొక్క వద్ద పూజలు చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హరితోత్సవాన్ని నిర్వహిస్తున్నారని
గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలు నర్సరీలు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన గాలి అందేలా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు.
ఈ హరితహారం కార్యక్రమం ఒక విప్లవంగా కొనసాగుతుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, మరియు భావితరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మొక్కలు నాటడం అలవాటుగా చేసుకోవాలని అలాగే వాటిని పరిరక్షించాలని సూచించారు. ఈకార్యక్రమంలో డిఆర్ డి ఓ అధికారిని కాలిందిని, ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్, మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆది మల్లయ్య, ఎంపీడీవో లాజర్ ఎంపీఓ పద్మ, ఏపివో శ్రీలత, గుండ్రాంపల్లి సర్పంచ్ రత్నం పుష్ప నరసింహ, ఉపసర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీలు పద్మ కుమారస్వామి, దేవరపల్లి సత్తిరెడ్డి, మండల బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆవుల ఐలయ్య, పొన్నం లక్ష్మయ్య, శివశంకర్ గౌడ్, జిట్ట బొందయ్య, వివిధ హోదాలలో ఉన్న నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.