SAKSHITHA NEWS

WhatsApp Image 2023 06 30 at 7.05.47 PM

గ్రామాల అభివృద్దే బిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే చిరుమర్తి.
నిర్నేముల, లక్ష్మాపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
రామన్నపేట సాక్షిత ప్రతినిధి

రాష్ట్రంలో గ్రామాల అభివృద్దే బిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రామన్నపేట మండలం లోని నీర్నేములలో 50లక్షలు, లక్ష్మాపురంలో 25లక్షలు, కొత్తగూడెంలో 20 లక్షల వ్యయంతో గ్రామ పంచాయతీ బిల్డింగ్, 10లక్షలతో సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. చిన్నచిన్న గ్రామ పంచాయతీలకు సైతం అధిక నిధులు కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ప్రజా సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెడుతుందని దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని గ్రామాలు అభివృద్ధి జరిగినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. గ్రామాల అభివృద్ధిలో ఎక్కడ రాజీ పడకుండా అభివృద్ధి పనులను చేపడుతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం, సర్పంచులు ముత్యాల సుజాత రవి, ఉప్పు ప్రకాష్ ,సింగిల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందడి ఉదయ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, టిఆర్ఎస్ మండల కార్యదర్శి పోషబోయిన మల్లేశం ,
మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎండి అమీర్ ,
మాజీ మండల యూత్ అధ్యక్షుడు నోముల శంకర్,
నాయకులు బద్దుల రమేష్, గర్దాస్ విక్రమ్, పోతరాజు సాయి, చల్ల సత్య ప్రకాష్, ఎండి ఇనాయత్ , ఆవుల నరేందర్,జెట్టి శివప్రసాద్ , ఆవుల శ్రీధర్, చిన్నపాక రమేష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS