సాక్షితతిరుపతి : నాటి పాదయాత్రలో ప్రజల కష్టాలను నేరుగా చూసిన జగన్ మోహన్ రెడ్డి, తాను అధికారంలోకి రాగానే తాను ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నాడని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి ఎం.ఆర్ పల్లె సర్కిల్లో మూడవ విడత వై.ఏస్.ఆర్ ఆసరా సంబరాల్లో పాల్గొన్న ఎమ్మేల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణలు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ 2014లో చంద్రబాబు అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని తిరుపతి నుంచే హామీ ఇచ్చి మోసం చేశాడని, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నారని ప్రసంశించారు. అక్క చెల్లెళ్ల ఖాతాల్లో ఇప్పటి వరకు 2లక్షల 25 వేల కోట్లు వేశారని, పేద మహిళలు సంతోషంగా ఉంటే మీ ఆనందం చూడలేక, సహించలేక సీఎం జగన్ పై విషం కక్కుతున్న చంద్రబాబును తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 30 లక్షలు అక్క చెల్లెమ్మలకు ఇంటి పట్టా అందించిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే చెల్లిందన్నారు.
ఒక్క తిరుపతిలోనే 24 వేల ఇంటి పట్టాలు అందించారని, 1200 కోట్ల రూపాయలు తిరుపతి ప్రజలకు అందజేశారన్నారు. 80 వేల మంది తిరుపతిలో నాకు ఓటు వేస్తే ఈరోజు 2లక్షల 30 వేల మందికి సంక్షేమ పథకాలు ఒక్క తిరుపతిలో అందివ్వడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు కేవలం జగన్ మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, సంక్షేమ పథకం ఇస్తాను అని ఎక్కడ చంద్రబాబు చెప్పడం లేదన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పేదవాళ్ళు సంక్షేమ పథకాలు ఆగి పోతాయన్నారు. గడప గడపకు మేము వస్తూంటే మీరు ఆదరిస్తున్నారు అంటే సీఎం జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలే తమ బలమన్నారు. సీఎం జగన్ అన్న మళ్లీ అధికారంలోకి వస్తే పేదలకు మరింత సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. వై.ఎస్సార్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మహిళలు సంతోషం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటి సభ్యులు ఎస్.కె.బాబు, కార్పొరేటర్లు ఆరణి సంధ్య, సునీత, దూది కుమారి, మోహన్ యాదవ్, అదనపు కమిషనర్ సునీత, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, మెప్మా రాధమ్మ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.*