పాత రోడ్లకు కొత్త కళ తెస్తున్నాము – మేయర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్
సాక్షిత : తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్లో నిర్మించిన రోడ్లను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ రెడ్డి, ముద్ర నారాయణ, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్.కె.బాబు, కార్పొరేటర్ కోటూరు ఆంజినేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్లో కెనడి నగర్ అదేవిధంగా ఓల్డ్ తిరుచానూరు రోడ్డు ప్రాంతాల్లో సిసి రోడ్డు, కాలువలు, బిటి రోడ్లను 97 లక్షల రూపాయలతో నిర్మించడం జరిగిందన్నారు. తిరుపతి నగరంలో చాలా కాలం ముందు వేసిన రోడ్లు పాడైపోయి ఉండడంతో ప్రజలు, స్థానిక కార్పొరేటర్లు కౌన్సిల్ దృష్టికి తీసుకురావడంతో దాదాపు 50 డివిజన్లలో పాడైపోయిన రోడ్డ స్థానంలో కొత్త రోడ్లు నిర్మించి రోడ్లకు ఒక కళ తీసుకురావడం జరుగుతున్నదన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని రోడ్లను ఆధునికరించి త్వరలో ప్రారంభిస్తున్నట్టు మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈ సంజీవ్ కుమార్, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ అమరనాధ్ రెడ్డి, మాజి జెడ్ పిటిసి వెంకటమునిరెడ్డి, సాకం ప్రభాకర్, శ్యామల తదితరులు పాల్గొన్నారు.