జాతి నిర్మాతలు _నేటి యువతీ యువకులు

Spread the love

జాతి నిర్మాతలు నేటి యువతీ యువకులని పద్మావతి విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ భారతి అన్నారు. శనివారం మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా గాంధీ ఆడిటోరియంలో కేంద్ర ప్రభుత్వ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా యువ ఉత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ నేటి యువతీ యువకులే రేపటి పౌరులని, దేశం కీర్తి పెంచాల్సిన బాధ్యత ప్రతి పౌరునిమీద ఉందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ కాత్యాయిని మాట్లాడుతూ జాతి నిర్మాతలుగా ప్రతి విద్యార్థి ఎదగాలని సూచించారు .దేశంలో ప్రపంచంలో అత్యధిక యువశక్తి భారతదేశంలోనే ఉందని ,ఇంతటి మానవరుల సంపద ఎక్కడా లేదని పేర్కొన్నారు, భారతదేశం కీర్తి ప్రతిష్టలు పెంచాలంటే అది యువతరం మీదే ఉందని తెలియజేశారు, అనంతరం ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మేయర్ డాక్టర్ బి.ఆర్ శిరీష మాట్లాడుతూ జాతి నిర్మాతలు నేటి యువతీ యువకులని అన్నారు .దేశం భవిష్యత్తు విద్యార్థుల మీద యువతరం మీద ఆధారపడి ఉందని పేర్కొన్నారు .ప్రతి విద్యార్థి తమ జ్ఞానాన్ని సామర్ధ్యాన్ని ప్రతిభని పంచుకొని దేశం కీర్తిని పెంచాలని సూచించారు. నెహ్రూ యువ కేంద్రం ఇటువంటి పోటీలు పెట్టి విద్యార్థులలోని సృజనాత్మక శక్తి యుక్తుల్ని వెలికితీస్తున్నందుకు అభినందించారు. యోగా ధ్యానం క్రీడలు సాంస్కృతిక పోటీలు వంటి వాటిలో ప్రతి విద్యార్థి పాల్గొని తమ ప్రతిభ చాటాలని సూచించారు .ఈ సందర్భంగా పంచప్రాన్ అంశాలుగా ఐదు విభాగాలుగా యువతీ యువకులకు విద్యార్థులకి పోటీలు నిర్వహించారు. నృత్యం, కవిత్వం ,చిత్రలేఖనం మొబైల్, ఫోటోగ్రఫీ, డిక్లమేషన్ వంటి అంశాల మీద పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో సుమారు 420 మందియువతి యువకులు పాల్గొన్నారు పంచప్రాన్ పోటీల విజేతలు

నృత్యం ఉదయ వీణ బృందం, నాగవేణి బృందం, రమ్య బృందం ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు కైవసం చేసుకున్నారు, కవిత్వంలో పూజిత ,భవ్య, హసీనా ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు అందుకున్నారు. మొబైల్ ఫోటోగ్రఫీ లో శ్రీనిధి ,శైలేశ్వర, నారాయణమ్మ ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు గెలుచుకున్నారు.. డెక్ల మేషన్లో ధరణి, కె చందన, ప్రగతి జైస్వాల్ ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు అందుకున్నారు. చిత్రలేఖనంలో కే .అశ్విత టి .విష్ణుప్రియ బి. ప్రత్యూష ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు అందుకున్నారు. అంతేకాకుండా రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ స్వచ్ఛంద సంస్థగా ద్వితీయ స్థానం సాధించిన యోగ అసోసియేషన్ ఆఫ్ చిత్తూర్ డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు గారిని 50 వేల రూపాయల నగదు బహుమతిని అందజేస్తూ సన్మానించడం జరిగింది. అతిధులకు ఘన సత్కారం
యువ ఉత్సవానికి
అతిధులుగా విచ్చేసిన నగర మేయర్ డాక్టర్ శిరీష, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ భారతి విద్యార్థి విభాగం అధ్యక్షురాలు డాక్టర్ కాత్యాయని యోగా అసోసియేషన్ ఆఫ్ చిత్తూర్ శ్రీనివాసులు నాయుడు గురజాడ ఫౌండేషన్ అధ్యక్షులు పి .హరికృష్ణా రెడ్డి, మహర్షి అభ్యుదయ సేవా సంస్థ అధ్యక్షులు జ్ఞాన శేఖర్ రెడ్డి లను ఘనంగా సత్కరించారు. అనంతరం విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కి అలాగే నెహ్రూ యువ కేంద్రం వాలంటీర్స్ కి జ్ఞాపికలు అందించారు .పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసా పత్రాలు అందజేశారు .ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం అకౌంట్ ఆఫీసర్ ఎంసి బాబు రెడ్డి యోగా గురువు బండి కుమార్ న్యాయమూర్తులు డాక్టర్ నారాయణస్వామి ,రఘుపతి సుమన శ్రీ ,శ్రీనివాసులు, శ్రీనివాసరాజు m.n.raaju దుర్గ ,షాజహాన్ నెహ్రూ కేంద్రం వాలంటీర్లు పద్మావతి విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page