SAKSHITHA NEWS

గిరిజనులు అభివృద్ధి చెందాలన్నదే కేసీఆర్ లక్ష్యం – ఎమ్మెల్యే భగత్
ఘనంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవ గిరిజనోత్సవం
గుర్రంపోడు సాక్షిత ప్రతినిధి

నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలం తేనేపల్లి, గాసిరామ్ తండాలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ గిరిజనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ పాల్గొని తేనేపల్లి తండ గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించబోయే గ్రామ సచివాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తండాకు చేరుకున్న ఎమ్మెల్యే భగత్ కుమార్ కి ప్రజా ప్రతినిధులకు స్థానిక సర్పంచ్ వడిత్య రజిత నాగరాజు నాయక్ కోలాటాలతో డబ్బు చప్పులతో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి స్వపరిపాలన చేసుకునే విధంగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని, అన్ని రంగాల్లో వెనుకబడ్డ గిరిజనులను గత పాలకులు వారి అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహించారని తెలంగాణ సీఎం కేసీఆర్ విద్యా, ఉద్యోగం, ఉపాధి రంగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించడంతోపాటు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో కోట్ల రూపాయలు వెచ్చించి బంజారా భవన్ నిర్మించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ కి గిరిజనులు అండగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఫోరం జిల్లా అధ్యక్షులు మంచికంటి వెంకటేశ్వర్లు,వైస్ ఎంపీపీ వజ్జ ధనుంజయ, మండల పార్టీ అధ్యక్షులు గజ్జల చెన్నారెడ్డి,ప్రధాన కార్యదర్శి రామగిరి చంద్రశేఖర్ రావు, ఉపాధ్యక్షులు వెలుగు రవి,సర్పంచ్ లు రజిత నాగరాజు నాయక్ , గాసిరామ్ తండా సర్పంచ్ మెగవత్ బిక్కీ దాసు నాయక్, చాడ చక్రవర్తి, జక్కల భాస్కర్, కామాల్ల నరసింహ,మర్రి సైదులు, పోలే రామచంద్రం చంద్రమౌళి, ఎంపీటీసీ శేఖర్ రెడ్డి, ఉపసర్పంచ్ సురేందర్, మాజి ఎంపీటీసీ రొంటి మల్లయ్య , మండల సీనియర్ నాయకులు , మేకల వెంకట్ రెడ్డి,తరి వెంకటయ్య, యువజన అధ్యక్షులు కుప్ప పృధ్వి రాజు,ఏస్సీ సెల్ మండల అధ్యక్షులు బొంగరాల శ్రీను,మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు ఏలుకొండ నగేష్, మండల సోషల్ మీడియా అధ్యక్షుడు మర్ల రమేష్, ఉపాధ్యక్షులు కట్ట సత్యనారాయణ,ఆవుల కుమార్, ఎస్టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి ఒడిత్య తానేష్, చిరంజీవి నాయక్, రజనీకాంత్,మేడి లింగయ్య, పోలేని నరసింహ, ఇటికాల శివ, మారపాక వెంకటయ్య, బొల్లం నరసింహ,ఉప సర్పంచ్ కూర శ్రీను,బాణాల రామకృష్ణారెడ్డి, సందీప్,బొల్లం నరేష్, పూల సహదేవ్, కొండపల్లి గిరి,శివర్ల రామలింగం, కున్ రెడ్డి శంకర్ రెడ్డి,సింగం బాలకృష్ణ, యాదగిరి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS