యానిమల్ కేర్ సెంటర్ ను సందర్శించిన ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ

Spread the love

శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరేకపూడి గాంధీ 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండలో గల యానిమల్ కేర్ సెంటర్ ను సందర్శించి వీధి కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ప్రక్రియ గురించి మరియు యానిమల్ కేర్ సెంటర్ విది విధానాల గురించి సిబ్బంది తో చర్చించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ఈ యానిమల్ కేర్ సెంటర్ లో కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి వాటిని వేరువేరు కెనాల్స్ లో పెట్టి నాలుగైదు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచి వదిలిపెడుతున్నారని అన్నారు. యానిమాల్ కేర్ సెంటర్ ను పరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహిస్తున్న సిబ్బందిని అభినందించారు. అలాగే ఇటీవల వీధి కుక్కల వల్ల జరిగిన దురదృష్టకర సంఘటనలను దృష్టిలో పెట్టుకొని సిబ్బంది మరింత అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కాశినాథ్ యాదవ్, శివరాజ్ గౌడ్, యానిమల్ కేర్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page