ములుగు జిల్లా :
దేశ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 119 కి 115 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి సీఎం కేసీఆర్ చరిత్ర స్పష్టించారని, పట్టుమని 10మంది అభ్యర్థులను ప్రకటించలేని పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్ అన్నారు. సోమవారం వారు ములుగు జిల్లాలో పర్యటించి ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
జూన్లో హఠాన్మరణం చెందిన దివంగత జడ్పీచైర్మన్ కుసుమ జగదీశ్వర్ కుటుంబ సభ్యులకు మంత్రులు, కార్యకర్తల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ సమకూర్చిన రూ.కోటి 50లక్షల విలువైన చెక్కును అందజేశారు.అనంతరం మంత్రులు మాట్లాడుతూ..
రానున్న ఎన్నికల్లో ములుగు గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని పనిచే సే నాయకులకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు…