కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పతనమయ్యే రోజులు దగ్గరలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సాక్షిత : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గల అల్పా హోటల్ ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలోవంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య,పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొని కట్టెల పొయ్యి పైవంట చేసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పతనమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్ని,ఒక్కవంట గ్యాస్ ధరలను పెంచడం వలన అన్ని రకాల వస్తువుల పై ధరల ప్రభావం పడుతుందని, పేద,మద్య తరగతి ప్రజలకు తీరని అన్యాయంజరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
2014 కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్యాస్ సిలెండర్ ధర 410 రూపాయలు ఉంటే సిలెండర్ కు దండం పెట్టి నిరసన తెలిపిన నరేంద్ర మోడీ ప్రధాని గా బాద్యతలు చేపట్టిన 8 సంవత్సరాల కాలంలో 745 రూపాయలు పెంచి గ్యాస్ ధర ను 1155 రూపాయలు చేసి ప్రజల పై పెనుభారం మోపారని ధ్వజమెత్తారు.గ్యాస్ ధరల పెంపు పట్ల దేశం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తుందని అన్నారు.
పెంచిన ధరలను తగ్గించే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ లలో ధర్నా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్న బిజెపి కి అధికారంలో ఉండే అర్హత లేదని, ప్రజలు కూడా విసిగివేసారి పోయారని, రానున్న ఎన్నికలలో కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అద్యక్షుడు ఆకుల హరికృష్ణ,నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్,నాగులు,జయరాజ్,నరసింహ ముదిరాజ్, అమర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.