ప్రీతి మృతి కేసు: పోలీసుల కస్టడీలో సైఫ్; 6గంటల పాటు ప్రశ్నలవర్షం!!

Spread the love

ప్రీతి మృతి కేసు: పోలీసుల కస్టడీలో సైఫ్; 6గంటల పాటు ప్రశ్నలవర్షం!!

తెలంగాణ రాష్ట్రంలో కలకలంగా మారిన మెడికో ప్రీతి మృతి కేసులో అటు ప్రీతి కుటుంబ సభ్యులు, పౌర సంఘాలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్న క్రమంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
కాకతీయ మెడికల్ కళాశాల పిజి వైద్య విద్యార్థిని ప్రీతి మృతి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం కేఎంసీలో అనస్థీషియా హెచ్ ఓ డి నాగార్జున రెడ్డిపై ఆరోపణలు వచ్చిన క్రమంలో ఆయనపై వేటు వేసింది. ఆయన పై చర్యలలో భాగంగా నాగార్జున రెడ్డిని భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ప్రీతి సైఫ్ తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసిన క్రమంలో అనస్తీషియా విభాగపు హెచ్ఓడీ నాగార్జున రెడ్డి సరిగ్గా స్పందించలేదని, ఆయన సరిగ్గా స్పందించి ఉంటే ప్రీతి ఆత్మహత్య చేసుకునేది కాదని, నాగార్జున రెడ్డి పై ఆరోపణలు వచ్చిన క్రమంలో ప్రభుత్వం ఆయనను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడైన సైఫ్ ను వరంగల్ పోలీసులు నిన్న కస్టడీలోకి తీసుకొని విచారణ మొదలుపెట్టారు. ఖమ్మం జైలు నుంచి నిన్న వరంగల్ మటవాడ పోలీస్ స్టేషన్ కు నిందితుడు మెడికో సైఫ్ ను తీసుకువచ్చిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

నిన్న దాదాపు 6 గంటల పాటు మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో సైఫ్ ను విచారించారు. స్వయంగా సైఫ్ విచారణను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి రంగనాథ్ పర్యవేక్షించారు. సాంకేతికంగా సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని పోలీసులు సైఫ్ కు అనేక ప్రశ్నలు సంధించారు. ప్రీతి, సైఫ్ మధ్య ఎందుకు గొడవలు వచ్చాయి? సైఫ్ ప్రీతిని వేధించాలని ఎందుకు ప్రయత్నించాడు. తోటి మెడికోలతో ప్రీతి గురించి ఎందుకు చెప్పాడు అనే అంశాలతో పాటు వాట్సప్ చాటింగ్ పై కూడా సైఫ్ ను పోలీసులు ప్రశ్నించినట్టు సమాచారం.నేడు రెండవ రోజు కూడా సైఫ్ ను పోలీసులు విచారించనున్నారు. ప్రీతి మృతి కేసు నిందితుడు సైఫ్ ను కోర్టు అనుమతితో నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్న అంశాలతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ ల పైన విచారణ జరుపుతున్నారు. మరోవైపు తనకు ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులో ఫిబ్రవరి 28వ తేదీన సైఫ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై ఇంతవరకు కోర్టు విచారణ జరపలేదు. సైఫ్ నాలుగు రోజులపాటు పోలీసు కస్టడీలో విచారణ ఎదుర్కొనే క్రమంలో ఈ కేసులో మరేమైనా ముఖ్యమైన విషయాలు బయటకు వస్తాయా అన్నది తెలియాల్సి ఉంది.

హత్యే అంటూ సంచలన ఆరోపణలు చేసిన ప్రీతి సోదరుడు

నిన్న ప్రీతి సోదరుడు పృథ్వి ఈ కేసుపై సంచలన ఆరోపణలు చేశారు. తన సోదరిది హత్యే అన్నారు. నిమ్స్ లో ప్రీతి పొత్తికడుపు వద్ద సర్జరీ చేశారని, ఆ సర్జరీ ఎందుకు చేశారో కూడా ఇప్పటివరకు తెలియలేదని పేర్కొన్నాడు ప్రీతి సోదరుడు. ప్రీతికి చేతి పై గాయం ఉందని, ప్రీతికి పూర్తిగా శరీరంలో బ్లడ్ డయాలసిస్ చేశారని పేర్కొన్న అతను పోస్టుమార్టంలో ప్రీతి బాడీలో ఉన్న ఇంజక్షన్ గురించి ఎలా తెలుస్తుంది అంటూ ప్రశ్నించారు. నిమ్స్ లో జరిగిన చికిత్సపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page