సాక్షితమహబూబ్ నగర్:- దేశంలో బీజేపీ పాలనకు సీఎం కేసీఆర్ చరమగీతం పాడబోతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వరంగల్ జిల్లాలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలను చీల్చి కూల్చేది మోడీ సర్కార్ అని ఫైర్ అయ్యారు. తెలంగాణలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ కుట్ర చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ, ప్రధాని మోడీ కుట్రలు, పాచికలు తెలంగాణలో పారలేదని అన్నారు. బీజేపీ కుట్రలను తెలంగాణ ప్రజలు సాగనివ్వరని హెచ్చరించారు. తెలంగాణలో అమలు అవుతోన్న ఎన్నో పథకాలు మాకు కావాలని దేశంలో ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ చేస్తున్నారని అన్నారు. కానీ, బీజేపీ విధానాల వల్ల భారత్ ఇంకా అభివృద్ధి చెందడం లేదని ధ్వజమెత్తారు.
BRS ప్రభుత్వాన్ని కూల్చేందుకు మోడీ కుట్ర: మంత్రి శ్రీనివాస్
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…