ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల FSCS వైస్ చైర్మన్ మేటి సోమ రాములు తనయుడు భాస్కర్ ను ఆ హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఈ సందర్భంగా మంత్రి సోమ రాములు కుటుంబాన్ని పరామర్శించారు. సంఘటన కు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లతో మాట్లాడి మంచి వైద్యం అందించాలని ఆదేశించారు. వారి కుటుంబానికి అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు