ప్రధాని మోడి వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్

Spread the love

సాక్షిత : అయోమయం అందోళన కరంగా సాగిన మోడీ ప్రసంగం…..
ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల్లో వరాల జల్లు కురిపించే మోడి ఇక్కడ ఎలాగూ ఓడిపోతామని తెలిసి అభివృద్ధి గురించి ప్రస్తవించకుండా కేవలం రాజకీయ వీమర్శలు చేసారు.
దేశంలో బి ఆర్ ఎస్ ఆదరణ తట్టుకోలేక ఓటమి భయంతో మోడి అసత్యలు, విమర్శలు చేస్తున్నారు.
తెలగాణ అభివృద్ధికి మీరు ఏం చేసారో ముందు చెప్పండి.
తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయి అంటే అది కేసీఆర్ గొప్పతనం.
తెలంగాణ రాష్ట్ర అబివృద్ధిని బీజేపీ అడ్డుకున్నా, కేసీఆర్ సాధించి చూపించారు.
తెలంగాణ రాష్ట్ర పథకాలు కాపీ కొడుతుంది మీరు కాదా….
మీకు నిజంగా తెలంగాణ రాష్ట్రం పై ఎమాత్రం చిత్తశుద్ధి ఉన్న విభజన హామిల అమలు పై మాట్లాడేవారు.
కోచ్ ఫ్యాక్టరీ అడిగితే వ్యాగన్ యూనిట్ ఇచ్చారు.
గిరిజన విశ్వవిద్యాలయాన్ని అడ్డుకొని, అడవి బిడ్డల గురించి మాట్లాడటం ప్రధాని కపటప్రేమకు నిదర్శనం.
15 వేల మంది స్ధానికులకు ఉద్యోగాలిచ్చే బయ్యారం ఫ్యాక్టరీ గురించి ఒక్క మాట కూడా ప్రధాని మాట్లాడలేదు.
ఆదివాసి ఆరాధ్యదేవతలైన మేడారం సమక్క,సారలమ్మల జాతరకు జాతీయ పండుగ గుర్తింపు దక్కకుండా మోడీ అడ్డు పడుతున్నారు.
ఈ జాతరకు ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ మహాజాతరకు కోట్లాది రూపాయలు వెచ్చించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన ఎర్పాట్లు చేస్తుంది.
వరంగల్ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని చేతులు దులుపుకున్న మోడీకి ఆలయాలను అభివృద్ధి చేయాలనే సోయిలేదు.
బీజేపీ కుట్రపూరిత వాగ్ధనాలు, మాయమాటలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు…బీజేపీ నాయకుల అసత్యాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఇక్కడ ప్రజలను మోసం చేయలేరు.
ప్రధాన మంత్రి మోడీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయగలరో చెప్పకుండా, ఉపన్యాసం ఇచ్చి ఉత్త చేతులతో వెళ్లిపోవడం పరిపాటిగా మారింది.
తండ్రి పాత్ర పోషించాల్సిన ప్రదాని మోడీ తెలంగాణ రాష్ట్రం పై వివక్షచూపుతూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.
తెలంగాణ ప్రజలు అడుగుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పట్టించుకోకుండా తన సొంత రాష్ట్రానికి 20 వేల కోట్ల రూపాయల లోకోమోటివ్ ఫ్యాక్టరీని మోసపూరితంగా తరలించుకుపోయారు మోడీ.
బీజేపీ పతనం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో మోడీ డ్రామాలకు ప్రజలు శాశ్వతంగా తెర వేస్తారు.
కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం 40 శాతం కరప్షన్ కు పాల్పడుతుందని ప్రజలు గద్దె దించారు.
అది చూసిన తర్వాత కూడా ప్రధాని మోడీ ..ప్రతిపక్ష పార్టీలు కరప్షన్ కు పాల్పడుతున్నాయని చెప్పడం సిగ్గుచేటు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రేస్ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారు.
కార్పోరేట్ శక్తులకు వెన్నుదన్నుగా నిలిచి,పేద ప్రజల బ్రతుకులను బలి చేస్తున్న ప్రదాని మోడీ డ్రామాలకు తెలంగాణ ప్రజలు ఎండ్ కార్డ్ వేస్తారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పడం ఖాయమని మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు.

Related Posts

You cannot copy content of this page