యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు రాపోతు అనిల్ గౌడ్
నిన్న ,నేడు పదవ తరగతి పరీక్ష పత్రాల లీకేజీ ఘటనలపై ఇవాళ కల్వకుర్తిలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు రాపోతు అనిల్ గౌడ్ పత్రికా సమావేశం నిర్వహించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏం నడుస్తుందంటే లీకేజీల వ్యవహారం నడుస్తుందన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. ఇంత నడుస్తున్న పాలన అధికారులు, మంత్రి, ముఖ్య మంత్రి ఏమాత్రం వీటి పై స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతోటి ఏడాదికాలంగా చదువుకుంటూ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఈ ఘటనలు గుదిబండలా తయారై , వారు మనోస్థైర్యాన్ని కోల్పోతున్నారన్నారు. కొంతమంది దొంగలు లీకేజీ వీరులుగా తయారై ఈ ప్రశ్న పత్రాలను లీకేజ్ చేయడంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టడం లేదని వారు విమర్శించారు. గత కొంతకాలంగా టీపీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం ఘటన మరువక ముందే ప్రస్తుతం పదవ తరగతి ప్రశ్నాపత్రాలు బయటకు రావడంపై కనీసం విద్యాశాఖ మంత్రి తన బాధ్యతగా వ్యవహరించడం లేదని, దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టడం లేదని కాబట్టి వెంటనే తన తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బీస బాలరాజు, నియోజకవర్గ కార్యదర్శి జంగయ్య గౌడ్,ఆమనగల్ పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్, పాల్గొన్నారు.