SAKSHITHA NEWS

Minister RK Roja conducted a review on seasonal diseases awareness & preventive measures

image 5
నగరి నియోజకవర్గ ప్రభుత్వ డాక్టర్ల తో, మునిసిపల్, మరియు మండల అభివృద్ధి అధికారులతో సీజనల్ వ్యాధుల అవగాహన & ముందస్తు జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఆర్కే రోజా _
ఈరోజు నగరి మంత్రి నివాస కార్యాలయం నందు నగరి నియోజకవర్గ ప్రభుత్వ డాక్టర్లతో మరియు మున్సిపల్, మండల అభివృద్ధి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ ఈ సీజన్లో ప్రభలే వ్యాధుల గురించి ఆస్పత్రి అధికారులు తీసుకుంటున్న చర్యలపై శానిటేషన్ జరుగుతున్న తీరుపై అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రతి మండలంలోని మండలంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల యొక్క అవసరాలను అక్కడ సిబ్బంది కొరతను మరియు వారి యొక్క సాధక బాధలను గురించి అడిగారు.
మంత్రి మాట్లాడుతూ…
ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూడా డెంగ్యూ జ్వరం గుర్తించడానికి CBC మెషిన్లను మంజూరు కల్పించాలని అదేవిధంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ECG సౌకర్యం కూడా అందుబాటులో ఉంచాలని దానికి తగిన చర్యలు తీసుకుంటామని
ప్రధానంగా పుత్తూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డ్రైనేజీ ప్రాబ్లం నివారించడానికి మున్సిపల్ కమిషనర్ తో మెడికల్ ఆఫీసర్ తో సంప్రదింపులు జరిపి దీనికి ప్రత్యేక సమావేశం నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అదే విధంగా నగరి ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న గైనకాలజిస్ట్ ENT, డెర్మటాలజీ డాక్టర్లను కూడా భర్తీ చేస్తామని ప్రతి ఆసుపత్రిలో కూడా స్టాఫ్ నర్సులు జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయడానికి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కార్యక్రమం చివరిలో రూపాయలు 30000.00 విలువ చేసి మెడికల్ టెస్టింగ్ కిట్లను, మెడిసిన్ లను బుగ్గ అగ్రహారం, మరియు విజయపురం ప్రభుత్వ ఆసుపత్రులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో నగిరి నియోజకవర్గంలోని డాక్టర్లు నగరి పుత్తూరు మున్సిపల్ సిబ్బంది నగిరి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు అలాగే నగిరి మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

SAKSHITHA NEWS