Minister Puvwada reviewed the arrangements for CM KCR’s visit.
సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పువ్వాడ..
ఈనెల 18న లాంఛనంగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం..
5లక్ష మందితో BRS జాతీయ తోలి సభకు వేదిక కానున్న ఖమ్మం
భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ తో పాటు కేరళ, పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు, UP మాజి సీఎం.
సీఎం కేసీఆర్ పర్యట ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, పోలీస్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి.
ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఅర్ పర్యటన నేపద్యంలో ఆయా ఏర్పాట్ల పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు.
నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ ను ముఖ్యమంత్రి కేసీఅర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
TRS నుండి BRS గా ఆవిర్భవించిన అనంతరం జాతీయ తోలి సభ 5లక్షల మంది ప్రజలతో 100ఎకరాల స్థలంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని మంత్రి పువ్వాడ తెలిపారు.
సభకు ముఖ్య అతిథులుగా కేసీఅర్ తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయ్ విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మన్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లు హాజరుకానున్నారని తెలిపారు.