SAKSHITHA NEWS

తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు నేపథ్యంలో 80 పల్లె వెలుగు బస్సులు 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్, సీటర్‌లు అందు బాటులోకి వచ్చాయి.

హైదరాబాద్‌లోని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించారు.

సంస్థ ఎండీ సజ్జనార్‌, ఇతర ముఖ్య అధికారులు పాల్గొ న్నారు.కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిర క్షణకు పెద్దపీట వేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారని ఈ సంద ర్భంగా మంత్రి పొన్నం తెలిపారు.

సీసీఎస్‌ బకాయిలు త్వరగా విడుదల చేస్తామని వెల్లడించారు. త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్‌ బస్సులు ఆర్టీసీకి అందుబాటులోకి రాబోతున్నన్నట్టు ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు.

వీటిలో హైదరాబాద్‌కు 500, జిల్లాలకు 500 బస్సులు కేటాయించ నున్నట్టు వివరించారు.

WhatsApp Image 2023 12 30 at 4.25.04 PM

SAKSHITHA NEWS