SAKSHITHA NEWS

సత్య నాదెళ్లతో మంత్రి లోకేశ్ భేటీ

సత్య నాదెళ్లతో మంత్రి లోకేశ్ భేటీ
అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేశ్ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఏఐ, ఐటీ, నైపుణ్యాభివృద్ధికి సత్య నాదెళ్ల మద్దతు కోరినట్లు మంత్రి లోకేశ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో డిజిటల్ పరివర్తనకు సహకారం అందించాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నాదెళ్లతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.


SAKSHITHA NEWS