Minister KTR laid foundation stones and inaugurated the buildings of caste societies
హుజురాబాద్ నియోజకవర్గం లో అభివృద్ధి పదంలో కమలాపూర్
రూ.49 కోట్లతో పలు అభివృద్ధి పనులు
మంగళవారం కుల సంఘాల భవనాలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి కేటీఆర్
కమలాపూర్, జనవరి 31
కనీవినీ ఎరుగని రీతిలో కమలాపూర్ మండలం అభివృద్ధి జరుగుతున్నది. ప్రజలు ఊహించని విధంగా ఒకే రోజు 49 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ మంగళవారం కుల సంఘాల భవనాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గూడూరు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన హెలిపాడ్ నుండి కమలాపూర్ ప్రధాన వీధుల్లో రోడ్ షో నిర్వహించిన కేటీఆర్ పలువురు ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు.49 కోట్లతో నిర్మించిన ఏంజెపి గురుకుల వసతి గృహం, కుల సంఘాల భవనాలు, జర్నలిస్టుల డబుల్ బెడ్ రుమాలు, ప్రారంభించారు.
బైక్ ర్యాలీగా కమలాపూర్ లో ఎం ఆర్ ఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాల ప్రారంభించి, రిబ్బన్ కట్ చేశారు.
అనంతరం విద్యార్థులతో లంచ్ చేసి మాట ముచ్చట లో పాల్గొన్నారు.. తెలంగాణ రాష్ట్రంలో టి అర్ ఎస్ ఆధ్వర్యంలో పార్టీలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుందనడానికి ఇది నిదర్శనం అన్నారు. ఇవీ అభివృద్ధి పనులు*
కోటి 50 లక్షలతో జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇండ్ల కు, కోటి 71 లక్షలకు ఆర్టీసీ బస్ స్టాండ్ కు, 25 లక్షలతో sc కమ్యూనిటీ హాలు, 25 లక్షలతో అయ్యప్ప గుడి, 30 లక్షలతో పెద్దమ్మ గుడి, 50 లక్షలతో గౌడ సంఘం కమ్యూనిటీ హాలు, 30 లక్షలతో మార్కండేయ గుడి లకు శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే, 69 లక్షల 85 వేలతో 10 వివిధ కుల సంఘాల భవనాల సముదాయానికి, 19 కోట్లతో mjp బాలుర పాఠశాల, 20 కోట్లతో mjp బాలికల, 2 కోట్లతో కస్తూర్బా, 2 కోట్ల 50 లక్షలతో ప్రభుత్వ జూనియర్ కాలేజి భావనలకు కేటీఆర్ ప్రారంభోత్సవం చేశారు.
…..** రోడ్డు షో లో భాగంగా మంత్రి కేటీఆర్ కాన్వయని అడ్కునేందుకు ప్రయత్నించిన ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి నాయకులు మంత్రి రోడ్ షోలో భాగంగా నల్లజెండాలను పట్టుకుని నిరసన తెలిపిన ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకులు. దీంతో
ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి నాయకుల పై దాడికి పాల్పడిన స్థానిక బి ఆర్ఎస్ నాయకులు ఎన్ ఎస్ యు ఐ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి నాయకులు మాట్లాడుతూ
తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ తన కుటుంబానికి కొడుకు కూతురుకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు ఆరోపించారు మిషన్ భగీరథ పేరుతో తనకు నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు దోసుకుంటున్నాడని ఆరోపించారు. జమ్మికుంట లో బహిరంగ సభ రోడ్డు మార్గంలో వెళ్లారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్డిఓ వాసు చంద్ర, ఎంపీపీ తడక రాణి శ్రీకాంత్ జెడ్పిటిసి లాండియా కళ్యాణి లక్ష్మణరావు తాసిల్దార్ రాణి, ఎంపీడీవో పల్లవి, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు బిఆర్ఎస్ నాయకులు తదితర అధికారులు పాల్గొన్నారు.