సాక్షితనెల్లూరు : పొదలకూరు మండలంలో పొదుపు మహిళా సభ్యులతో కిక్కిరిసిన ద్వారకామాయి కళ్యాణమండపం.
మహిళలను ఆకట్టుకున్న మంత్రి కాకాణి ప్రసంగం.
పొదుపు సంఘాల సభ్యులు “వైయస్సార్ ఆసరా” ద్వారా కలుగుతున్న లబ్ధితో పాటు, ప్రభుత్వ సబ్సిడీ, బ్యాంకు రుణం ద్వారా సమకూర్చుకున్న స్వయం ఉపాధి పథకాలకు చెందిన స్టాల్ లను పరిశీలించి, మహిళలతో ముచ్చటించిన మంత్రి కాకాణి.
*సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు పట్టణంలోని ద్వారకామయి కళ్యాణ మండపం నందు “YSR ఆసరా” 3వ విడత కార్యక్రమంలో పాల్గొని, పొదుపు సంఘాల సభ్యులకు 8,41,26,399/- రూపాయల చెక్కును అందజేసిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి *
రాష్ట్రంలోని ప్రతి మహిళను సొంత అక్కాచెల్లెళ్ళుగా భావించి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పధకంలో మహిళలను భాగస్వాములను చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్న కాకాణి గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని మెరుగైన జీవనోపాధి కల్పన దిశగా మహిళలు ముందంజలో ఉండాలనీ సూచించిన మంత్రి కాకాణి.
నెల్లూరు జిల్లాలోని 34,440 గ్రూపులకు 826 కోట్లు మంజూరు చేసామని అందులో సర్వేపల్లి నియోజకవర్గంనకు సంబంధించి 4056 గ్రూపులకు 91 కోట్ల 83 లక్షలు నిధులు మంజూరు కాగా, పొదలకూరు మండలం నకు సంబంధించి 1039 గ్రూపులకు 25 కోట్ల నిధులు మంజూరయ్యాయని వివరించిన మంత్రి కాకాణి.
ఇంత పెద్ద మొత్తంలో ఒక పధకానికి నిధులు కేటాయించడం గతంలో ఎన్నడూ లేదన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటికే రెండు విడతలు మంజూరు చేసి ఇప్పుడు మూడో విడత నిధులు మంజూరు చేశారని వెల్లడించిన మంత్రి.
పొదలకూరు మండలం నకు సంబంధించిన YSR ఆసరా 3 వ విడత మొత్తం 8 కోట్ల 41 లక్షల 26 వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల చెక్కును మహిళలకు అందచేశారు