“మనుబోలు మండలంలో మంత్రి కాకాణి ఎన్నికల ప్రచారం”

Spread the love

సాక్షిత : “సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, కాగితాల పూర్, లక్ష్మీ నరసింహ పురం గ్రామలలో బుధవారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి కాకాణి”

“గ్రామాలలో పర్యటించిన మంత్రి కాకాణికి అడుగడుగున పూల వర్షంతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు”

“బాణాసంచా కాల్పులు, గజమాలలు, డప్పు వాయిద్యాలు, తప్పెట్లు, కోలాటాలు, మహిళల మంగళ హారతులు, యువత కేరింతలతో అట్టహాసంగా కొనసాగిన మంత్రి కాకాణి ఎన్నికల ప్రచారం “

“సర్వేపల్లి లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీస్సులతో కనివిని ఎరుగని రీతిలో 50 వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధిస్తాం”

“సర్వేపల్లి నియోజకవర్గం లో రాబోవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలకు చెందిన ప్రతి సమస్యను పరిష్కరిస్తాం”

“సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా రాజకీయాలు చూడలేదని పేదరికమే అర్హతగా చూసామన్న మంత్రి కాకాణి”

“దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే అమలు చేశామన్న మంత్రి కాకాణి”

“దేశంలో ఎక్కడా లేని విధంగా 3 వేల పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అని పేర్కొన్న మంత్రి కాకాణి”

“ప్రతినెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ లను అందించే ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న మంత్రి కాకాణి”

“సర్వేపల్లి లో గతంలో ఎంతోమంది శాసనసభ్యులుగా పని చేసినా ఎన్నడూ లేని విధంగా గ్రామ గ్రామానా పూర్తిస్థాయిలో సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు, సాగునీరు, త్రాగునీరు వసతి కల్పించామన్న మంత్రి కాకాణి”

“రైతులకు చుక్కల భూముల సమస్యతోపాటు అసైన్మెంట్ భూముల పట్టాలు పంపిణీ చేశామన్న మంత్రి కాకాణి”

“అన్యాప్రాంతమైన భూములకు పట్టాలు, నోషనల్ ఖాతాలు తెరిపించడం, ఇనాం భూములకు పట్టాలు అందించడం లాంటి అనేక సమస్యలను పరిష్కరించి రైతుల భూములకు యాజమాన్య హక్కు పత్రాలను అందించామన్న మంత్రి కాకాణి”

“సర్వేపల్లి నియోజకవర్గంలో గడచిన ఐదు సంవత్సరాలలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్న మంత్రి కాకాణి”

“గ్రామాలలో రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు అందించి పంటలు పండించాం – మంత్రి కాకాణి”

“పండిన పంటలకు కనీస మద్దతు ధర కన్నా 30% అధికంగా ధరలు వచ్చేట్టు చర్యలు తీసుకున్నామన్న మంత్రి కాకాణి”

“తెలుగుదేశం హయాంలో రైతులకు కనీసం గిట్టుబాటు ధర కూడా రాలేదన్న మంత్రి కాకాణి”

“సోమిరెడ్డి మిల్లర్ ల దగ్గర ముడుపులు మింగి రైతుల నడ్డి విరిచాడన్న మంత్రి కాకాణి”

“రైతులు తమ ధాన్యాన్ని 12 వేల రూపాయలకు తెగ నమ్ముకుని తీవ్రంగా నష్టపోయారన్న మంత్రి కాకాణి”

“రైస్ మిల్లర్ ల వద్ద సోమిరెడ్డి 50 కోట్ల రూపాయలు చందాలు దండుకోవడం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారు అన్న మంత్రి కాకాణి”

” రైతులు తమ ధాన్యాన్ని 22 వేల నుండి 24 వేల వరకు అమ్ముకుని సంతోషంగా ఉన్నారన్న మంత్రి కాకాణి”

“తెలుగుదేశం హయాంలో ధాన్యం ధరలు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ధాన్యం ధరలను రైతులు గమనించాలన్న మంత్రి కాకాణి”

“సోమిరెడ్డి నీరు చెట్టు, రైతు రథం పేరిట అవినీతికి పాల్పడడం, రైతులను అడ్డుపెట్టుకొని దోచుకోవడం తప్ప సర్వేపల్లి అభివృద్ధికి ఒరగబెట్టింది ఏమి లేదు”

“సర్వేపల్లి లో కరోనా కష్టకాలంలో ప్రజలను పట్టించుకున్న తెలుగుదేశం నాయకుడే కరువయ్యాడు అన్న మంత్రి కాకాణి”

“కరోనా సమయంలో ప్రతి ఇంటికి బియ్యం, నిత్యవసర వస్తువులను అందజేసి వారిని ఆదుకున్నామని గుర్తు చేసిన మంత్రి కాకాణి”

“కరోనా సమయంలో ప్రతి ఇంటికి ప్రభుత్వం ఇచ్చే రేషన్ కు అదనంగా 3 కోట్ల రూపాయలు విలువైన బియ్యం, వంట నూనె పంపిణీ చేశామన్న మంత్రి కాకాణి”

“కరోనా సమయంలో ప్రజల కోసం నిలబడ్డామని.. మృత్యువును సైతం ఎదుర్కొన్నామని తెలిపిన మంత్రి కాకాణి”

“ప్రజలకు ఎప్పుడో కనపడే సోమిరెడ్డికి కాకుండా.. నిత్యం అందుబాటులో ఉండే కాకాణి గోవర్ధన్ రెడ్డి కి మీ ఆశీస్సులు అందించండి”

“ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు నాయకులు ఎన్నో హామీలు ఇస్తుంటారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారా లేదా అన్నదే ముఖ్యమన్న మంత్రి కాకాణి”

“రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ప్రతి ఇంటికి ఉద్యోగం అని చెప్పి చంద్రబాబు మోసం చేశాడన్న మంత్రి కాకాణి”

“వాలంటీర్ లు ఇళ్ల దగ్గరకు వెళ్లి పెన్షన్ లు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నాడన్న మంత్రి కాకాణి”

“2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని గుర్తుచేసిన మంత్రి కాకాణి”

“ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరితేనే ఓటు వేయమని ధైర్యంగా అడగగలిగిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్న మంత్రి కాకాణి”

“చంద్రబాబు డ్వాక్రా రుణాలకు సంబంధించి మాట తప్పితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 4 విడతల్లో డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేసి మాట నిలబెట్టుకున్న వ్యక్తి అని ప్రశంసించిన మంత్రి కాకాణి”

“చెప్పి ఎగ్గొట్టే చంద్రబాబుని పక్కన పెట్టి.. చెప్పినవి చెప్పినట్లుగా ఇంటికి చేర్చే జగన్ మోహన్ రెడ్డి ని ఆదరించండి అన్న మంత్రి కాకాణి”

“నిత్యం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, సర్వేపల్లి నుంచి పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేసిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్థన్ రెడ్డి “

Related Posts

You cannot copy content of this page