“సాక్షితనెల్లూరు జిల్లా* : మహోన్నత వ్యక్తిత్వం కల్గిన శ్రీరామచంద్ర స్వామి జీవితం మానవాళికి ఆదర్శప్రాయం.”*
౼ రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి* కాకాణి గోవర్ధన రెడ్డి.*
శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని శబరి శ్రీరామ క్షేత్రం ఆధ్వర్యంలో కన్నులపండుగగా నిర్వహించిన జగదభిరాముడు శ్రీ సీతారామ స్వాముల కళ్యాణానికి సతీమణి శ్రీమతి విజితతో కలిసి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె.వి.యన్.చక్రధర్ బాబు దంపతులు, శబరి శ్రీరామ క్షేత్రం కమిటీ సభ్యులు, భక్తులు.
ఈ సందర్బంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ…*
23 సంవత్సరాలుగా శబరి శ్రీరామ క్షేత్రం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాలు నిరాటoకంగా, దిగ్విజయంగా జరుపటం సంతోషదాయకమన్నారు.
ధర్మాన్ని కాపాడటానికి ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా, ధీటుగా ఎదుర్కోవాలనే శ్రీరాముల వారి జీవితం ప్రస్తుత సమాజానికి ఆదర్శమన్నారు.
జీవితంలో ఆచరించాల్సిన, సాధించాల్సిన వాటి గురించి స్వయంగా ఆచరించి చూపి పురుషోత్తముడిగా అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచారన్నారు.
ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.