అన్ని వర్గాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం – మంత్రి జగదీష్ రెడ్డి

Spread the love

అన్ని వర్గాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం – మంత్రి జగదీష్ రెడ్డి

— కర్ణాటక ఎన్నికలు బిజెపికి చెంపపెట్టు

— వచ్చే ఎన్నికల్లో బిజెపికి ప్రజలే బుద్ధి చెబుతారు

— హనుమజ్జయంతి వేడుకల్లో
పాల్గొన్న మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి.

చిట్యాల సాక్షిత ప్రతినిధి

అన్ని వర్గాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. హనుమజ్జయంతి సందర్భంగా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోనీ ప్రఖ్యాతిగాంచిన హనుమాన్ దేవాలయంలో హనుమ జ్జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
మంత్రి జగదీశ్ రెడ్డి దంపతులు, నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య లు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా మంత్రికి ఎమ్మెల్యేకి వేదమంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ 3వ సారి అధికారంలోకి వస్తుందని అన్నారు. బిజెపి నియంతృత్వ పొకడలతో దుర్మార్గమైన పరిపాలన చేస్తుందని విసిగి వేజారిన ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కన్నడ నాట ప్రజలు ఇచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనం అన్నారు. తమకు ఎవరు ఎదురులేని మాకు మేమే సాటి అని దుర్మార్గంగా వ్యవహరిస్తున్న మోడీ అమిత్ షా లు విర్ర వీగుతున్నారనీ గతంలో 9 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజల తీర్పును వమ్ము చేసి అక్రమ పద్ధతిలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన దుర్మార్గపు పార్టీ బిజెపి అని, ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎట్లా ఉంటదో అనడానికి కర్ణాటక రాష్ట్రం ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దివాలాకోరు స్థితిలో ఉందని అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినా కూడా నిలబెట్టు కోలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రజల్లో బిజెపిపై వ్యతిరేకత ప్రారంభమైందని వచ్చే ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం పూర్తిగా పతనం అవడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో
ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్, జడ్పిటిసి సుంకరి దనమ్మ యాదగిరి గౌడ్ చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, ఎంపిటిసి దేవరపల్లి సత్తిరెడ్డి,
గుండ్రాంపల్లి సర్పంచ్ రత్నం పుష్ప నరసింహ, పెద్ద కాపర్తి సర్పంచ్ మర్రి జలంధర్ రెడ్డి, వెలిమినేడు ఉపసర్పంచ్ మహంకాళి మచ్చేందర్,
వెలిమినేడు పిఎసిఎస్ చైర్మన్ రుద్రారపు బిక్షపతి, బిఆర్ ఎస్ పార్టీ మండల కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, కౌన్సిలర్ బెల్లి సత్తయ్య, చౌటుప్పల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చింతకింది వెంకటేష్, మండల యువజన విభాగం అధ్యక్షులు తుమ్మల నాగరాజు రెడ్డి, నాయకులు బోయపల్లి శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దేవి రెడ్డి సుధాకర్ రెడ్డి, రాచకొండ కృష్ణయ్య, జిట్టా చంద్రకాంత్, సామిడి మహేందర్ రెడ్డి, గంపల మధు, బాలగోని రాజు, సింగిరెడ్డి జంగారెడ్డి, కాకులారపు బొర్రారెడ్డి, నాతి శ్రీనివాస్ గౌడ్, వివిధ హోదాలలో ఉన్న నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page