బదిలీపై వెళ్తున్న ఆదర్శ ఉపాధ్యాయురాలిని అభినందించిన ఎంఈఓ ఆంజనేయులు

Spread the love

యర్రగొండపాలెం మండలం చిన్న బోయలపల్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న శాసనాల లలిత అనే ఉపాధ్యాయురాలు బదిలీపై గురిజేపల్లి ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్న సందర్భంగా శాలువాతో సన్మానించి సత్కరించారు.

శాసనాల లలిత లెర్నింగ్ బై లలిత అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆటలు, పాఠాలు అర్థమయ్యే రీతిలో నైపుణ్యాలను విద్యార్థులకు తీర్చిదిద్దుతున్నారని ఎంఈఓ కొనియాడారు.

అనంతరం జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page