మెడికల్ విద్యార్థి ప్రీతి నాయక్ ది ఆత్మహత్య కాదు… ప్రభుత్వ హత్య – కూన శ్రీశైలం గౌడ్
సాక్షిత : బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు.. గిరిజన వైద్య విద్యార్థిని ప్రీతి నాయక్ హత్య సహా రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా ఐడిపిఎల్ చౌరస్తా వద్ద బిజెపి ఆధ్వర్యంలో నిరసన ర్యాలి.
ర్యాలీ లో పెద్ద ఎత్తున పాల్గొన్న పలు కళాశాలల విద్యార్థులు.
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడూతూ.. రాష్ట్రంలో నేరాల కంటే.. అత్యాచారాలే ఎక్కువగా ఉన్నాయి
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై రాష్ట్ర ప్రభుత్వమే భాద్యత వహించాలి.
సిరిసిల్లలో ఆరేండ్ల చిన్నారి పై అఘాయిత్యం చేస్తే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు..
లక్షలాది సిసి కెమెరాలు అమర్చి నేరాలపై నిఘా పెట్టమని ప్రభుత్వం గొప్పలు చెప్తున్నా.. ఇంకా ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.
డా. ప్రీతి హత్యను.. ఆత్మ హత్య గా చిత్రీకరిస్తూ.. ప్రభుత్వం నేరస్తులను కాపాడే ప్రయత్నం చేస్తుంది…
రాష్ట్రంలో జరుగుతున్న మహిళల అత్యాచారాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి పై విచారణ చేపట్టి దోషులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసారు.