SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 08 at 2.46.16 PM

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు …

  • 7నూతన అంబులెన్సులు ప్రారంభం అచ్చంపేట:- అచ్చంపేట నియోజకవర్గ ప్రాంత ప్రజలకు మరింత చేరువలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 7నూతన అంబులెన్సులను జెండా ఊపి ప్రారంభించి, ప్రధాన రహదారి గుండా ఎన్టీఆర్ స్టేడియం వరకు అంబులెన్స్ నడిచారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి అత్యధిక నిధులను కేటాయించి బడుగు బలహీన వర్గాల ప్రజల వైద్యం కోసం ఎలాంటి ఆందోళన చెందకుండా వారికి మెరుగైన వైద్య సేవలు అందించడమే ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను పాశపడుతుందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ ఆధ్వర్యంలో వైద్య విధాన పరిషత్ అచ్చంపేట పట్టణంలో ఏర్పాటు చేసి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడం జరుగుతుందని, అవసరమైన సదుపాలను మరింత మెరుగుపరచడానికి నా వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.

అచ్చంపేట పట్టణంలో అధునాతనమైన వైద్య సేవలను అందించడానికి అదేవిధంగా మారుమూల గ్రామాలకు వైద్య సేవలు విస్తరించడానికి అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందనీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా అమ్మఒడి వాహనాలను కేటాయించి వారికి మెరుగైన వైద్య సేవలను అందించడానికి ఈ యొక్క వాహనాలు ఉపయోగపడుతుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్, మండల పార్టీ అధ్యక్షులు పర్వతాలు ముదిరాజ్, నాయకులు అమినోదిన్, రాజేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS