మహిళలు ఉపాధి, ఉన్నతి కోసం,వారి ఎదుగుదల కోసం మెప్మా ఎప్పుడు తోడ్పడుతుంది-మెప్మా డైరెక్టర్ విజయలక్ష్మి
మహిళలకు సుస్థిర జీవనోపాధులు కల్పించాలన్న ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన సంఘసభ్యులకు తిరుపతిలోని అనూస్ ప్రాంగణంలో మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి , తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ శిరీష ,అనూస్ సంస్థ యం.డి అనురాధ తో కలిసి శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మిషన్ డైరెక్టర్ మాట్లాడుతూ ఈ శిక్షణకు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్న మరియు ఆసక్తి కలిగిన స్వయం సహాయక సంఘ సభ్యులను ఎంపికచేసి వారు స్వయం ఉపాధి పొందేలా శిక్షణలను నిర్వహించడమౌతుందని తెలిపారు అలాగే ఆమె మరింత వివరంగా మాట్లాడుతూ మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పించటమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని, అందుకు గాను పట్టణ ప్రగతి యూనిట్లు, ఆహా క్యాంటీన్లు, జగనన్న మహిళా మార్ట్ లు, జగనన్న ఈ – మార్ట్ లు, బ్యూటిషియన్ కోర్స్ మొదలగు కార్యక్రమాలు నిర్వహించుట జరగుచున్నదని, ఈ అవకాశాన్ని మహిళలందరూ వినియోగించుకొని, మహిళలందరూ ఆర్థిక సుస్థిరత సాధించాలని తెలిపారు.
మేయర్ శిరీష మాట్లాడుతూ ప్రతి మహిళను లక్షాధికారిని చేయుటకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా, చేయూత, సున్నావడ్డీ, జగనన్న తోడు వంటి పథకాల ద్వారా ఆర్ధిక సహకారం అందిస్తున్నారు మరియు ఆ డబ్బులతో జీవనోపాధి యూనిట్లు ఏర్పాటుచేసి తద్వారా స్వయం ఉపాధి కల్పించుటకు మెప్మా సంస్థ విశేషంగా కృషిచేస్తుందని తెలిపారు.
అనూస్ యం.డి మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా మహిళలను నిపుణులైన బ్యూటీషియన్లు గా శిక్షణ ఇస్తామని అలాగే విజయవంతంగా శిక్షణ పూర్తయిన వారిని మా సంస్థలో మరియు ఇతర సంస్థలలో ఉద్యోగాలు పొందడంలో సహకారం అందిస్తామని అలాగే సొంతంగా బ్యూటీ పార్లర్ పెట్టుకొనుటకు సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష , అనుస్ సి.ఈ.ఓ.అనురాధ , చిత్తూరు జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధమ్మ , మెప్మా. ఏ.ఓ.
రామాంజనేయులు, మెప్మా యస్.యం.యం.లు ఆదినారాయణ,శ్రీనివాస్, తిరుపతి సి.యం.యం.కృష్ణవేణి,తిరుపతి మెప్మా సిబ్బంది ఆర్.పి.లు పాల్గొన్నారు.
అనంతరం రామచంద్ర పుష్కరిణి సమీపంలో మెప్మా మహిళా మార్ట్ ఆధ్వర్యంలో మహిళలు నూతనంగా ఏర్పాటు చేసిన చపాతి మేకింగ్ యూనిట్ ను నగర మేయర్ డాక్టర్ శిరీష చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు.