అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా స్కానింగ్ కేంద్రం ఘనంగా ప్రారంభోత్సవం చేసిన మేయర్ డాక్టర్ శిరీష
నగరం లో పాత మెటర్నిటీ ఆసుపత్రి రోడ్డులోని రాజన్న పార్కు సమీపంలో నూతనంగా ఏర్పాటైన మహిళలు మరియు మహిళలు కోసం ప్రత్యేకమైన స్కానింగ్ సెంటర్ ప్రారంభోత్సవం బుధవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష ముఖ్యఅతిథిగా హాజరై స్కానింగ్ సెంటర్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున స్కానింగ్ సెంటర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తిరుపతి నగరంలో మహిళలు, గర్భిణుల కోసం ప్రత్యేకంగా స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం స్కానింగ్ సెంటర్ అధినేత డాక్టర్ (Ex-Major) సాయికృష్ణ మాట్లాడుతూ…. మహిళలు, గర్భిణుల కోసం ఆధ్యాత్మిక నగరంలో ప్రత్యేకంగా స్కానింగ్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రంలో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశామని… అత్యంత అనుభవమున్న డాక్టర్, సిబ్బందిని నియమించుకున్నట్లు తెలిపారు.
యుక్తవయస్సులోని ఆడపిల్లల ఆరోగ్య సమస్యలు, పీసీఓఎస్, ఓబేసిటీ, ఇన్ఫెర్టిలిటీ, ప్రీప్రెగ్నెన్సీ స్కానింగ్, ప్రెగ్నెన్సీ స్కానింగ్ / ఫీటల్ ఇమేజింగ్, పీటల్ ఇంటర్వెన్షన్స్ – సివిఎస్ సాంప్లింగ్, ఆమ్నియోసెంటసిస్, ఫీటల్ రిడక్షన్ ప్రొసీజర్లు, మేమోగ్రఫీ – స్క్రీనింగ్, డయాగ్నోస్టిక్ & బయాప్సి, ఎక్స్‌రే- వెల్ ఉమెన్ స్క్రీనింగ్ – పూర్తి శారీరక చెకప్‌లు చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని తిరుపతి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.