SAKSHITHA NEWS

Master plan for Tirupati development should complete roads – Commissioner Anupama

తిరుపతి అభివృద్దికి మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తి చేయాలి – కమిషనర్ అనుపమ, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్

సాక్షిత : తిరుపతి నగరాభివృద్దికి మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఏరియా డెవెలప్ రోడ్లు పూర్తి చేయడం అత్యవసరమని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి అన్నారు.

తిరుపతి నగరంలో అభివృద్ది కోసం చేపడుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల స్థితిగతులపై నగరపాలక సంస్థ కార్యలయంలో ప్లానింగ్ అధికారులు, ప్లానింగ్ సెక్రటరీలతో కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడుతూ తిరుపతి నగరంలో అవసరమైన మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తి చేసే ప్రకియలో ఏవైన ఆటంకాలు వుంటె సత్వరమే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు.

నగరాలు అభివృద్ధి చెందాలంటే రహదారుల నిర్మాణాలు అభివృద్ది చెందాలనే దృక్పదంతో పని చేయాలన్నారు. ఇప్పటికే పూర్తి చేసిన అన్నమయ్య మార్గ్, వై.ఎస్.ఆర్ మార్గ్ మాస్టర్ ప్లాన్ రోడ్ల గురించి ఉదాహరిస్తూ నేడు ఆ రహదారులు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా వున్నాయన్నారు.

దశాబ్దాల నుండి అభివృద్దికి నోచుకోని కోర్లగుంట ప్రధాన రోడ్డు విస్తరణతో ఆ ప్రాంతం రాకపోకలకే కాకుండా ఏరియా అభివృద్దికి మూలం అవుతుందన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్లు అమలు అవుతున్న ప్రాంతాల్లోని స్థలాలు ఇచ్చిన వారికి త్వరగా టిడిఆర్ బాండ్లను అందించేందుకు, అదేవిధంగా లీగల్ సమస్యలు వుంటె సకాలంలో పరిష్కరించేలా చూడడం చేయాలన్నారు. రోడ్లు విస్తరిస్తే ప్రజా అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని ప్రజలకి వివరించాలన్నారు.

అనుకున్న సమయంలోనే మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తి చేసి తిరుపతి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చే భాధ్యత మనందరిపై వుందని కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, నరసింహాచారి,

అదనపు కమిషనర్ సునీత, ఎంఈలు చంద్రశేఖర్, వెంకటరామి రెడ్డి, డిఈలు విజయకుమార్ రెడ్డి, మహేష్, డిప్యూటీ సిటీ ప్లానర్ దేవి కుమారి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ పాండ్రేటి షణ్ముగం, సర్వేయర్లు, ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS