SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజక వర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, సంక్షేమ సంఘాల సభ్యులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి శుభకార్యాలకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలు, కాలనీలలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై వినతి పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ మీలో ఒకడిగా నన్ను చూసుకుంటూ 85576 ఓట్ల అఖండ మెజారిటీతో గెలిపించిన, నన్ను అభిమానించే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానన్నారు. అదేవిధంగా కాలనీలలో నూతనంగా చేపట్టబోయే అభివృద్ధి పనులకు ప్రణాళికలు రచించాలని అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు.

WhatsApp Image 2024 03 06 at 3.04.13 PM

SAKSHITHA NEWS