SAKSHITHA NEWS

టీచ్ ఫర్ చేంజ్ ద్వారా మంచు లక్ష్మి చేయూత.. డిజిటల్ తరగతులకు శ్రీకారం

గద్వాల : గట్టు మండలం ఆలూరు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించేందుకు సినీనటి మంచు లక్ష్మి జిల్లా కేంద్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్ సంతోష్ కుమార్ ను కలెక్టరేట్ లో సందర్శించారు.

గతంలో జిల్లాలో 30 పాఠశాలలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన మంచు లక్ష్మి, టీచ్ ఫర్ చేంజ్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్య, కంప్యూటర్ తరగతులు ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. ఆమె చర్యలకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


SAKSHITHA NEWS