SAKSHITHA NEWS

పార్లమెంటు ఎన్నికల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, కుమారులు,కోడళ్ళు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11 వార్డు బూత్ నెంబర్ 67 లోని మల్లు వెంకట నరసింహారెడ్డి మెమోరియల్ ప్రాథమిక పాఠశాల రాయినిగూడెం లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు అని ఒక ఉజ్జయిదాన్ని అందించి యుద్ధం చేయమన్నాడు. ప్రజాస్వామ్యంలో మనకు ఉన్నటువంటి అతి ముఖ్యమైన హక్కు ఓటు హక్కు దానిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. విశాలమైన భారతదేశంలో ఓటు ఎంతో విలువైనది అన్నారు. మంచి వ్యక్తులకు ఓట్లు వేసి ఎన్నుకోవడం ద్వారా మంచి పరిపాలనప్రజలకు అందుతుందన్నారు.ప్రజలు డబ్బుకు, మద్యానికి ఆశపడకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు వేయాలని సూచించారు. ఓటు ద్వారా మన భవిష్యత్తు మారుతుందన్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యం విరజిల్లుతుందన్నారు. అప్పుడే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందని సూచించారు.

WhatsApp Image 2024 05 13 at 4.59.47 PM

SAKSHITHA NEWS