కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు అశేషంగా తరలిరావాలి
మంత్రి పొంగులేటి పిలుపు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాల మైదానంలో ఈనెల 11న మధ్యాహ్నం 3గంటలకు జరిగే ప్రజా దీవెన సభను విజయవంతం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలుత భద్రాచలం రాములోరిని దర్శించుకుంటారని, ఆ తర్వాత అక్కడి వ్యవసాయ మార్కెట్ కమిటీ గ్రౌండ్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అనంతరం మణుగూరులో ప్రజాదీవెన సభలో ప్రసంగిస్తారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు గాను ఇప్పటికే నాలుగు గ్యారంటీలను నెరవేర్చామని, తాజాగా ఐదో గ్యారంటీకి సీఎం శ్రీకారం చుడతారని పేర్కొన్నారు. కావున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రజాదీవెన సభను విజయవంతం చేయాలని కోరారు.