మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారాలి.

Spread the love

ఐదేళ్లలో డ్వాక్రా సంఘాలకు లక్ష కోట్ల నిధులు

రాష్ట్రంలో ఇల్లు లేకుండా ఏ ఒక్కరూ మిగలకూడదు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

రాష్ట్రంలో ఇల్లు లేకుండా ఏ కుటుంబం ఉండరాదు అనేది ఇందిరమ్మ రాజ్య లక్ష్యం అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 చొప్పున మొదటి దశలో ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రతి లబ్ధిదారునికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలోని ప్రజలు చూసి చూసి అలసిపోయారని తెలిపారు. ఇది చాలా బాధాకరం అన్నారు.

రాష్ట్రంలోని అర్హులందరినీ గుర్తించి లబ్ధి చేకూరుస్తామన్నారు. ఈనెల 11న సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు అందించాలని నిర్ణయించాము. ఈ నెల 12న హైదరాబాదులో లక్షలాది మంది మహిళలతో భారీ సభ నిర్వహించి వడ్డీ లేని రుణాలకు తిరిగి శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. డ్వాక్రా మహిళలు చిన్న చిన్న వ్యాపారాలకి పరిమితం కాకుండా వారు పారిశ్రామిక వేత్తలు గా ఎదిగేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వివరించారు. రాష్ట్ర విభజన నాటికి మనది ధనిక రాష్ట్రము. కానీ గత పాలకులు ఇందిరా క్రాంతి పథం ని అట కెక్కించరని ఎద్దేవా చేశారు. ఈ విలేకరుల సమావేశంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు చింతకాని ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, ఖమ్మం నగర పార్టీ అధ్యక్షుడు జావిద్ , చింతకాని మండల పార్టీ అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వర్లు, కూరపాటి కిషోర్ స్థానిక నాయకులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page