మహాత్మ జ్యోతి బాపూలే రాష్ట్ర కమిటీ కన్వీనర్ గా దూదిమెట్ల శివ
చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మహాత్మా జ్యోతి బాపూలే 197వ జయంతి కార్యక్రమాల రాష్ట్ర కన్వీనర్ గా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలానికి చెందిన దూదిమెట్ల శివ యాదవ్ నియమించారు.
ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ పూలే జయంతి ఉత్సవాలలో ప్రజలంతా అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మంత్రి గంగుల కమలాకర్ , కెసిఆర్, కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే కన్వీనర్ గా పేరు సిఫారసు చేసిన బిసి కమిషనర్ నెంబర్ కిషోర్ గౌడ్ మరియు కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.