ఎంపీ నామ చొరవతో ఖమ్మం రైల్వే స్టేషన్ కు మహర్ధశ

Spread the love

ఎంపీ నామ చొరవతో ఖమ్మం రైల్వే స్టేషన్ కు మహర్ధశ

నామ తనిఖీలతో రైల్వే అధికారుల్లో కదలిక

స్టేషన్ లో పలు అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్

స్టేషన్ కు 60 సీసీ కెమెరాలు మంజూరు

ప్లాట్ ఫారాల్లో అదనంగా అంబరిల్లా పనులు

డ్రైనేజీ వ్యవస్థ మెరుగపర్చేందుకు చర్యలు

ఎంపీ నామకు రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ లేఖ

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు రైల్వే కి రాసిన లేఖలు, చేసిన తనిఖీలు, సూచనలతో ఎట్టకేలకు రైల్వే ఉన్నతాధికారుల్లో కదలిక వచ్చింది. దీంతో ఖమ్మం రైల్వే స్టేషన్ కు మహర్ధశ పట్టబోతుంది. అమృత్ భారత్ పథకం కింద ఖమ్మం రైల్వేస్టేషన్ ను తిరిగి మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తాజాగా ఎంపీ నామకు రాసిన లేఖలో దక్షిణ మధ్య రైల్వే చీఫ్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ స్పష్టం చేశారు. ఖమ్మం రైల్వేస్టేషన్ లో ప్రయాణీకులకు కనీస సౌకర్యాలు మెరుగు పర్చడంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన చేపట్టి, పనులను వేగవంతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పనులు పూర్తి చేసుకున్న ఎస్కలేటర్లను కూడా త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని, తద్వారా వృద్ధులు, వికలాంగులకు ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. గతంలో ఎంపీ నామ స్వయంగా ఖమ్మం రైల్వే స్టేషన్ ను సందర్శించి, ప్రయాణీకులతో, సంబంధిత అధికారులతో మాట్లాడి స్టేషన్లో జరుగుతున్న ఎస్కలేటర్లతో పాటు వివిధ అభివృద్ధి పనులను అధికారులతో కలసి తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో పెండింగ్ లో ఉన్న వివిధ అభివృద్ధి పనుల తనిఖీ సందర్భంగా తన దృష్టికి వచ్చిన సమస్యలు గురించి ఎంపీ నామ సంబంధిత ఉన్నతాధికారులకు లేఖ ద్వారా తెలియజేయడంతో పాటు రైల్వే మంత్రిని, ఉన్నతాధికారులను కూడా కలసి, ఖమ్మం స్టేషన్ లో పేరుకు పోయిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. కాగా తాజాగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఖమ్మం స్టేషన్ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు గురించి నామకు ప్రత్యేకించి రాసిన లేఖలో స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఖమ్మం రైల్వే స్టేషన్ లో 8 సీసీ కెమెరాలు మాత్రమే ఉన్నాయని, నిర్భయ నిధులు కింద అదనంగా 60 సీసీ కెమెరాలు మంజూరు చేశామని జైన్ తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించిన పనులను అతి త్వరలోనే చేపట్టడడం జరుగుతుందని తెలిపారు. ఇంకా స్టేషన్ లోని ప్లాట్ ఫారంలలో అదనంగా అంబరిల్లా వర్క్స్ చేయడం జరుగుతుందని తెలిపారు. చాలా కాలంగా పని చేయని సుజల స్రవంతి డ్రింకింగ్ వాటర్ కౌంటర్లు ను ఐఆర్ సిటిసి మంజూరు చేసిందని, అయితే లైసెన్స్ రుసుం చెల్లించని కారణంగా వారి కాంట్రాక్ట్ను రద్దు చేయడం జరిగిందని, కొత్తగా నాలుగు ఆటోమేటిక్ వాటర్ వెండింగ్ మిషిన్లను ఏర్పాటు చేసేందుకు రెండుసార్లు టెండర్లు పిలిచినా ఎలాంటి స్పందన రాలేదని, మళ్ళీ టెండర్లు పిలుస్తామని జైన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక జనరల్, మరోక ఉన్నత స్థాయి వెయిటింగ్ హాళ్లు అందుబాటులో ఉన్నాయని, అమృత్ భారత్ స్టేషన్ పధకం కింద మహిళలకు వెయిటింగ్ హాల్ ఏర్పాటును పరిశీలిస్తామని చెప్పారు. అంతేకాకుండా గార్డెనింగ్, ప్లాంటేషన్ పనులు నిర్వహించి, స్టేషన్లో పారిశుద్యాన్ని పూర్తి స్థాయిలో మెరుగుపర్చడం జరుగుతుందని తెలిపారు. ఆర్ధికంగా లేని పేద ప్రయాణీకులు, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే ప్రయాణీకులకు ఇజ్జత్ పథక కింద నెలవారీ సీజన్ టిక్కెట్లకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారిని గుర్తించి, సీజన్ టిక్కెట్లు జారీ చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. స్టేషన్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించి రైల్వే,మున్సిపల్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని, కాల్వల్లో మురుగునీటి సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు పరిశీలన జరుగుతుందన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page