మాదిగలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు
◆ ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలి
◆ ఓట్ల కోసమే బిజెపి ఎస్సీ వర్గీకరణ డ్రామా
◆ మాదిగల వ్యతిరేక పార్టీ బిఆర్ఎస్ ను బొంద పెట్టాలి
◆ కాంగ్రెస్ నేత డాక్టర్ కోటా రాంబాబు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
జిల్లాలో మాదిగలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోట అని మాదిగలు మరోసారి నిరూపించాలని కాంగ్రెస్ జిల్లా నాయకులు డాక్టర్ కోటా రాంబాబు అన్నారు.
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కోటా రాంబాబు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక దళిత ఓట్లు కలిగిన మాదిగ సామాజిక వర్గాన్ని మోసం చేసేందుకు బిజెపి, కాంగ్రెస్ పై విషప్రచారం చేస్తోందని విమర్శించారు. బిజెపిలో ఏనాడు దళితులకు ప్రాధాన్యత నివ్వలేదని, రాష్ట్రపతులను సైతం దేవాలయాల గేటు కూడా తాకనివ్వని దారుణమైన చరిత్ర బిజెపిదని విమర్శించారు. బిజెపి నర నరాల్లో దళిత వ్యతిరేక భావజాలం ఉంటుందని అన్నారు. మహనీయులు త్యాగాలకనుగుణంగా బడుగు బలహీన వర్గాల అభివృద్దే ధ్యేయంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్లను తొలగిస్తామంటున్న బిజెపికి ఈ ఎన్నికల్లో దళితులు, మాదిగ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ఆర్థిక భారాలను మోపినటువంటి బిజెపిని ఓడించాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు దళిత సామాజిక వర్గానికి ఉపయోగపడేలా ఉన్నాయని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసీ, రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మను మోసం చేసిన కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. లౌకిక వాదాన్ని మరచి మతపరమైన గొడవలకు దారితీసే బిజెపిని ఓడించి రాహూల్ గాంధీ నీ ప్రధానమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లా కంచుకోట అని గుర్తించి జిల్లాలో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చి గౌరవించిందన్నారు. వున్న ఏడు నియోజకవర్గాలు కాంగ్రెస్, కాంగ్రెస్ మిత్ర పక్షమైన సీపీఐ పార్టీ ఎమ్మెల్యేలుగా వున్నారని రాబోయే ఎన్నికల్లో మన పార్లమెంటు అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. రామసహాయం కుటుంబం తమ ఆస్తిలో పేదలకు బడుగు బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ తమ భూములను పంచిన కుటుంబం అన్నారు. ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు కొరిపల్లి శ్రీనివాస్, ఎస్సీ సెల్ కన్వీనర్ బొందయ్య, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షులు, కొక్కిరేణి ఎంపీటీసీ గుగ్గిళ్ల అంబేద్కర్, బొబ్బిల్లపాటి బాబురావు, సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నారపోగు వెంకట్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవికుమార్, మధిర మాజీ ఎంపీపీ యర్రగుంట లక్ష్మి రమేష్, టి.యం.హెచ్.డి ఖమ్మం జిల్లా అధ్యక్షులు దుపెల్లి శ్రీను మాదిగ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దేవరకొండ కిరణ్ మాదిగ, సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జి కనకపుడి వీరస్వామి మాదిగ, పాలేరు నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు గురవయ్య మాదిగ, వైరా నియోజకవర్గ ఇన్చార్జి నండ్రు వెంకన్న మాదిగ, మధిర నియోజవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకయ్య మాదిగ, ఖమ్మం నగర కన్వీనర్ కుక్కల కృష్ణ మాదిగ, రూరల్ మండలం అధ్యక్షుడు జంగం వెంకయ్య మాదిగ, కూసుమంచి మండలం అధ్యక్షులు చిన్న భద్రయ్య మాదిగ, యూత్ కాంగ్రెస్ నాయకులు దేవరకొండ రాజీవ్ గాంధీ, మేకల రమేష్, రత్నబాబు, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.