సమన్వయంతో గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి

సమన్వయంతో గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి

SAKSHITHA NEWS

సమన్వయంతో గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి చేద్దాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని జైదుపల్లి గ్రామంలో ఉదయం 07:00 AM నుండి 11:30 AM వరకు పర్యటించారు.

◆ రైతులు జైదుపల్లి గ్రామాన్ని మైలారం దేవరంపల్లి రైతు వేదిక క్లస్టర్ నుండి గొట్టిముక్కుల రైతు వేదిక క్లస్టర్ కు మార్చాలని కోరగా…. ఎమ్మెల్యే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి మైలారం దేవరంపల్లి క్లస్టర్ నుండి గొట్టిముక్కుల క్లస్టర్ కు మార్చాలని వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడారు.

◆ మిషన్ భగీరథ మంచినీటి పైపు లైన్లు ఎక్కడ కూడా లీకేజీలు లేకుండా, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి, గేట్ వాల్వ్ ఏర్పాటు చేసి, ప్రజలకు పరిశుభ్రమైన మంచినీటిని అందించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.

◆ పల్లె ప్రగతిలో కూల్చివేయని పాడు బడ్డ ఇండ్లను తొలగించాలంన్నారు.

◆ నెలలో మూడు సార్లు 1, 11, 21వ తేదీలలో మిషన్ భగీరథ త్రాగు నీటి ట్యాంకులను కచ్చితంగా శుభ్రం చేయాలన్నారు.

◆ మిషన్ భగీరథ మంచి నీటిని ప్రజలందరూ.. త్రాగాలని అందుకు మిషన్ భగీరథ అధికారులు అవగాహన కల్పించాలన్నారు.

◆ జైదుపల్లి గ్రామ సమీపంలోని మైసమ్మ కుంటలో నుండి విద్యుత్ లైన్ ను సైడ్ కు మార్చాలని, గ్రామంలో థర్డ్ వైర్ ఏర్పాటు చేసి, తదితర విద్యుత్ సమస్యలు పరిష్కారం చేయాలనని, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

◆ అనంతరం గ్రామంలో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS